క్రికెట్ పదకోశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది క్రికెట్ క్రీడలో ఉపయోగించే సాంకేతిక పదకోశం. సాంకేతిక పదాలు క్రికెట్ కు సంబంధించి చాల వరకు ఆంగ్లభాష లోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగులో సమానార్ధాలు ఉండక పోవచ్చు. అందుకని  ఈ సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధాలే (ఉంటే) కాకుండా వివరణ క్లుప్తం గా క్రికెట్ సందర్భానికి తగినట్లుగా ఇవ్వడం జరిగింది.

సాంకేతిక పదాలు వాటి అర్ధాలు లేదా వివరణలు ఆంగ్ల వికీపీడియా Glossary of cricket terms నుండి తీసుకున్నాము. వేరే తీసుకున్న పదాలకు ఆధారము (source) ప్రస్తావనాలలో పేర్కొన్నాము.

పదాలు తెలుగు అక్షర క్రమంలో సాంకేతిక పదం ఉచ్చారణ అనుసరించి ఇచ్చాము. ఉదాహరణకి - "బౌలింగ్" ను "బ" అక్షరం లో చూడవచ్చు. "వికెట్" ను W లో కాకుండా "వ" లో ఇవ్వడం జరిగింది.


ఆ-అః క-ఙ చ-ణత-న ప-మ య-ఱ

ఆక్యుపైయింగ్ ది క్రీజ్ (Occupying the crease):

బ్యాటర్ ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించకుండా,చాలా సేపు బాటింగ్ లో ఉండే చర్య. అవసరమైనప్పుడు ఈ విధమైన నైపుణ్యం కలిగిన (అవుట్ కాకుండా రక్షించు కుంటూ) డిఫెన్సివ్ బ్యాటింగ్ అవసరం. ఇది ప్రత్యేకంగా ప్రారంభ బ్యాటర్లలో లేదా 'డ్రా' కోసం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విలువైనదిగా పరిగణిస్తారు.

అప్పీల్ (Appeal):

2015 ప్రపంచ కప్ లో బౌలర్ ఒక వికెట్ ని తీసి హక్కుగా కోరుతున్నాడు
అభ్యర్ధన. క్రికెట్‌లో ఒక బౌలరు లేదా ఫీల్డరు లేదా బౌలింగ్ జట్టు బిగ్గరగా అరుస్తూ బ్యాటరును అవుట్ చేయమని అంపైర్‌ను అభ్యర్ధిస్తారు. ఈ అభ్యర్ధన వివిధ రకాలుగా ఉంటుంది. ఔట్‌కి సంబంధించిన ప్రమాణాలు / అంపైర్ నిర్ణయానుసారం నడుచుకుంటారు. స్పష్టంగా ఔటైన బ్యాటర్లు (ఉదా. బౌల్డ్ గానీ, స్పష్టమైన క్యాచ్ గానీ అయినపుడు) అప్పీల్ కోసం ఎదురుచూడకుండా సాధారణంగా మైదానం నుండి వెళ్ళిపోతారు.

ఆమెట్యూర్ (Amateur);

ఔత్సాహిక క్రీడాకారుడు. డబ్బు కోసం కాకుండా తమ సంతోషం కోసం ఆడే క్రికెటర్ (జెంటిల్‌మెన్) నాన్-ప్రొఫెషనల్. 18, 19వ శతాబ్దపు ఇంగ్లండ్‌లో విభిన్న సామాజిక తరగతి ఆటగాళ్ల మధ్య వ్యత్యాసం ఉండేది. ముఖ్యంగా నాన్-ప్రొఫెషనల్ ఉన్నత శ్రేణికి చెందినవారు , ప్రొఫెషనల్స్ (ఆటగాళ్ళు) శ్రామిక వర్గం, వేతనాలు లేదా ఆర్ధిక వనరుల కోసం క్రికెట్‌పై ఆధారపడే వారు. చాలా కౌంటీ క్రికెట్ జట్లు ఇలాంటి ఔత్సాహిక క్రీడాకారుల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి; కెప్టెన్ ఎప్పుడూ ఔత్సాహిక వర్గం వాడే. వార్షికంగా జెంటిల్‌మెన్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ మ్యాచ్ పోటీలు నిర్వహించేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ వ్యత్యాసం వాడుకలో లేకుండా పోయింది, చివరకు 1962లో రద్దు చేయబడింది.

అటాకింగ్ ఫీల్డ్ (Attacking field):

పిచ్ కు దగ్గరగా ఎక్కువ మంది ఫీల్డర్లను నిలిపే వ్యూహం. బాటర్లు ఎక్కువ పరుగులు చేయకుండా నిరోధించడానికి, వికెట్లు తీయడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు.

అటాకింగ్ షాట్ (Attacking shot):

ఎక్కువగా పరుగులు చేయడానికి దూకుడుగా, బలంగా బాటింగ్ చేసే విధానం.

ఆడి (Audi):

ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కదిలే రూపం (యానిమేషన్)
ఇది నాలుగు సార్లు వరుసగా డక్అవుట్ అయితే ఉపయోగించే పదం. ఇది జర్మన్ కారు తయారీదారు లోగో లోని నాలుగు వృత్తాలను (నాలుగు సున్నాలకు గుర్తుగా) సూచిస్తుంది.

ఆఫ్ బ్రేక్ (Off break):

ఒక ఆఫ్ స్పిన్ బౌలింగ్ డెలివరీ. ఇది కుడిచేతి (రైట్ ఆర్మ్) బౌలరు, కుడిచేతి వాటం బ్యాటరుకు ఆఫ్ సైడ్ నుండి లెగ్ సైడ్‌కి (సాధారణంగా బ్యాటర్‌లోకి) తిరుగుతుంది.

ఆఫ్ సైడ్ (Off side):

బ్యాటర్ బాటింగ్ చేసేటప్పుడు (స్ట్రైక్) బ్యాటర్ ముందున్న సగం పిచ్. కుడిచేతి వాటం బ్యాటర్ కోసం ఇది పిచ్ కుడి వైపు సగం, వికెట్ ని బౌలర్ వైపు చూస్తుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ కోసం ఎడమ సగం. లెగ్ సైడ్ కి అనుసరించి ఉంటుంది.

ఆఫ్ స్పిన్ (Off spin):

కుడిచేతి ఫింగర్ స్పిన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన స్పిన్ బౌలింగ్ శైలి.

ఆన్ ఏ లెంగ్త్ (On a length):

ఎక్కువ దూరానికి చేసిన బౌలింగ్

ఆన్ స్ట్రైక్ (On strike):

బౌలింగ్ ను ఎదుర్కొంటున్న బ్యాటర్
ఆన్ ఆర్థడాక్స్ (Unorthodox):
"పాఠ్యపుస్తకం" పద్ధతిలో ఆడని షాట్ లు, కొంత మెరుగుదలతో ఉంటుంది.
ఆన్ కాప్‌డ్ (Uncapped):
అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో ఎపుడూ ఆడని క్రీడాకారుడు/క్రీడాకారిణి
ఆన్ ప్లేయబుల్ డెలివరీ (Unplayable delivery):
ఒక బ్యాటర్ ఆడదానికి వీలులేని లేదా ఆడలేని బంతి.
ఆర్థడాక్స్ (Orthodox):
పద్ధతిలో ఆడే బ్యాటర్‌లు,"పాఠ్య పుస్తకం" పద్ధతిలో ఆడిన షాట్‌లు తీసిన పరుగులు. ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ చూడండి.

ఆల్ రౌండర్ (All-rounder):

సాధారణంగా, ఆల్-రౌండర్‌ అంటే ఒక ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నైపుణ్యం కలిగి ఉంటాడు. కొన్ని సంఘటనలలో వికెట్-కీపర్/బ్యాటర్‌ని కూడా మరొక రకమైన ఆల్-రౌండర్‌గా పరిగణిస్తున్నారు.

ఆల్ అవుట్ (All out):

సాధారణంగా పదకొండు మంది బ్యాటర్లలో పది మంది ఔట్ అయినందున, జట్టులో ఒక బ్యాటర్ మాత్రమే మిగిలి ఉంటాడు, కానీ ఒకరే ఆడలేరు కాబట్టి 10 మంది అవుట్ అయితే అంత మంది అవుట్ అయినట్లే. బ్యాటింగ్ జట్టు వికెట్లు అయిపోవడంతో ఒక ఇన్నింగ్స్ ముగిసింది.

అవుట్ (Out):

తొలగించబడిన బ్యాటర్ ఆట కొనసాగించలేని స్థితి. వికేట్ కోసం చేసిన అప్పీల్‌కు అంపైర్ సమాధానం ఇస్తూ చూపుడు వేలును పైకి ఎత్తి కొన్నిసార్లు మాట్లాడే పదం.

అవుట్ రైట్ విన్/లాస్ (Outright win/loss):

ఒక జట్టుకు రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి చేసిన మ్యాచ్‌లో గెలుపు లేదా ఓటమి లభిస్తుంది.

అవుట్ ఫీల్డ్ (Outfield):

పిచ్ మధ్యలో నుండి 30-గజాలు (27 మీటర్లు) వృత్తం వెలుపల ఉన్న మైదాన భాగాన్ని అవుట్ ఫీల్డ్ అంటారు. ఇది వికెట్ల నుండి దూరంలో ఉన్న పిచ్ భాగం.
ఇన్/అవుట్ ఫీల్డ్ (In/out field):
ఇన్/అవుట్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ సెట్టింగ్, వరుసగా బ్యాటర్‌కు దగ్గరగా లేదా బౌండరీకి దగ్గరగా ఉండే ఫీల్డర్‌ల సమూహం. సాధారణంగా 5 క్లోజ్ ఫీల్డర్‌లు 3 బౌండరీలో ఉంటారు,
ఇన్ ఫీల్డ్ (Infield):
30-గజాల వృత్తం (27 మీ) లోపల ఉన్న ప్రాంతం.
ఇన్నింగ్స్ (Innings):
ఒక జట్టు క్రీడాకారులు బాటింగ్ లేదా బౌలింగ్ చేసే ఆవృతం
ఇన్ సైడ్ ఎడ్జ్ (Inside edge):
బ్యాట్ అంచు బ్యాటర్ కాళ్లకు ఎదురుగా ఉంటుంది. బంతి 45 వద్ద సాధారణంగా స్టంప్‌లకు, కాళ్లకు వెళుతుంది.
ఎల్.బి.డబ్ల్యూ (LBW):
చూడండి - లెగ్ బిఫోర్ వికెట్
ఎకనామికల్ (Economical):
బౌలర్ ఒక ఓవర్(ల) నుండి చాలా తక్కువ పరుగులను ఇస్తే, అది మంచి ఎకానమీ రేటు. బౌలింగ్ ఎకనామి బౌలింగ్.
ఎకానమి రేట్ (Economy rate):
ఒక వ్యక్తిగత బౌలర్ ప్రతి ఓవర్‌కు ఇచ్చిన పరుగుల సగటు సంఖ్య. బౌలర్ కి ఈ విలువలు ఎంత తక్కువ ఉంటే అంత ఉత్తమముగా పరిగణిస్తారు.
ఎక్సపెన్సివ్ (Expensive):
బౌలర్ తన ఓవర్(ల) నుండి పెద్ద సంఖ్యలో పరుగులను ఇచ్చినప్పుడు, అతనికి అధిక ఎకానమీ రేటును ఉంటుంది.
ఎక్ష్ప్రెస్స్ పేస్ (Express pace):
150 కి.మీ./గం పైగా వేగం తో బౌలింగ్ చేస్తే దానిని ఎక్ష్ప్రెస్స్ పేస్ అంటారు.
ఎక్స్‌ట్రా ( Extra):
నిర్దిష్ట బ్యాటర్‌కు జమ చేయకుండా బ్యాటింగ్ జట్టుకు అందించిన పరుగులు. ఇవి స్కోర్‌కార్డులో విడివిడిగా నమోదవుతాయి. ఐదు రకాలు ఉన్నాయి: బైలు, లెగ్ బైలు, వైడ్స్, నో-బాల్స్ , పెనాల్టీలు. వైడ్‌లు నో-బాల్‌లు బౌలింగ్ విశ్లేషణలో వదలి వచ్చిన పరుగులుగా నమోదు చేయబడ్డాయి. మిగిలినవి బౌలర్‌కు ఆపాదించబడవు.
ఎలెవన్ (Eleven):
జట్టుకు చెందిన పదకొండు మంది క్రీడాకారులు.
ఎండ్ (End):
ఒక బౌలర్ ఏ చివర నుండి బౌలింగ్ చేస్తున్నాడో స్టంప్‌ వెనుక ప్రాంతం. బౌలర్లు పిచ్ యొక్క రెండు చివరల నుండి ప్రత్యామ్నాయ ఓవర్లను అందజేస్తారు.
ఎండ్ అఫ్ ది ఇన్నింగ్స్ (End of an innings):
ఇన్నింగ్స్ ముగుంపు. బ్యాటింగ్ చేసే జట్టుకు బ్యాటింగ్ చేయగల నాట్ అవుట్ బ్యాటర్లు ఇంక లేరు. ఆఖరి వికెట్ పడినప్పుడు లేదా ఒక బ్యాటర్ రిటైర్ అయినప్పుడు బ్యాటింగ్ జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుంది.
ఒ.డి.ఐ (ODI-One Day International):
ఒక రోజు ఆడే అంతర్జాతీయ జట్ల మధ్య పోటీ
ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ (One Day International - ODI):
రెండు జాతీయ జట్ల మధ్య ఒక్కో ఇన్నింగ్స్‌కు 50 ఓవర్లకు పరిమితం చేయబడిన మ్యాచ్, గరిష్టంగా ఒక రోజు వరకు ఆడబడుతుంది.
ఓపెనర్ (Opener):
మొదటి బ్యాట్స్ మన్ లేదా వుమన్, లేదా మొదటి బౌలర్
ఓపెనింగ్ బాటెర్ (Opening batter):
ఇన్నింగ్స్ ప్రారంభంలో ఉన్న ఇద్దరు బ్యాటర్లు. వారు తప్పనిసరిగా ఓపెనింగ్ బౌలర్లు కొత్త బంతిని ఎదుర్కోవాలి, కాబట్టి అవుట్ అవ్వకుండా ఉండటానికి మంచి డిఫెన్సివ్ టెక్నిక్ తో ఆడతారు. అయితే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ కూడా పవర్ ప్లే సమయంలో త్వరగా స్కోర్ చేయాలి.
ఓపెనింగ్ బౌలర్ (Opening bowler)
కొత్త బంతితో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బౌలర్. సాధారణంగా చాలా వేగంగా దుడుకుగా బౌలింగ్ చేస్తాడు.
ఓవర్ (Over):
ఒక బౌలర్ వరుసగా 6 బంతులు వేస్తే ఒక ఓవర్ అవుతుంది.
ఓవర్ రేట్ (Over rate):
ఒక గంటకి వేసే సగటు ఓవర్ లు
ఓవర్ ది వికెట్ (Over the wicket):
ఒక రైట్ ఆర్మ్ బౌలర్ వారి నాన్-స్ట్రైకర్ స్టంప్‌ల ఎడమ వైపుకు వెళతాడు.
ఓవర్ ఆర్మ్ (Overarm):
తలపై శరీరం వెనుక నుండి చేయి ఊపుతూ బౌలింగ్ చేయడం, మోచేయిని వంచకుండా డౌన్ స్వింగ్‌పై తలా మీదుగా బంతిని వదలడం. ఈ రకమైన బౌలింగ్ సాధారణంగా అన్ని అధికారిక క్రికెట్ మ్యాచ్‌లలో మాత్రమే అనుమతించబడుతుంది.
ఓవర్ త్రోస్ (Overthrows)
ఫీల్డర్ నుండి తప్పుగా విసిరిన బంతి కారణంగా అదనపు పరుగుల స్కోరింగ్ జరగవచ్చు. వీటిని బజర్స్ అని కూడా అంటారు. బంతి చాలా దూరం వెళ్లే అవకాశం ఉంది.

అం - అః[మార్చు]

అండర్ ఆర్మ్ (Underarm):
ఈ రకమైన బౌలింగ్ ఇప్పుడు అధికారిక క్రికెట్‌లో చట్టవిరుద్ధం, డౌన్‌స్వింగ్ ఆర్క్‌లో శరీరం వెనుక నుండి చేయి ఊపుతూ బౌలింగ్ చేయడం మోచేయిని వంచకుండా బంతిని అప్ స్వింగ్‌పై విడుదల చేయడం. కానీ సాధారణంగా అనధికారిక రకాల క్రికెట్‌లో ఆడతారు.
అండర్ స్పిన్ Under-spin (also back-spin):
బంతిని వెనుకకు భ్రమణం చేసి బౌలింగ్ చేసే ప్రక్రియ. దీనివలన పిచ్ చేసిన వెంటనే వేగం తగ్గుతుంది.
అంపైర్ (Umpire):
చట్టాలను అమలు చేసి తీర్పు చెప్పే అధికారి. ఒక అంపైర్ నాన్-స్ట్రైకర్ వద్ద వికెట్ వెనుక నిలబడి ఉండగా, రెండవ (సాధారణంగా) స్క్వేర్ లెగ్ వద్ద ఉంటారు. ప్రతి ఓవర్‌కు స్థానాలు మారుతూ ఉంటాయి. ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లకు స్కోర్ నిర్ణయాలను సూచించడానికి ఆర్మ్ సిగ్నల్స్ వ్యవస్థను ఉపయోగిస్తారు. టెలివిజన్ మ్యాచ్‌లు సాధారణంగా రీప్లేలు ఉపయోగిస్తున్నాయి. అంపైర్ నిర్ణయ సమీక్ష వ్యవస్థపై తీర్పునిచ్చేందుకు థర్డ్ అంపైర్‌ కూడా ఉంటాడు
అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టం (Umpire Decision Review System - UDRS):
అంపైర్ తీసుకున్న నిర్ణయాలను సవాలు చేసే వ్యవస్థ. మూడవ అంపైర్ కొన్ని సాంకేతిక ఉపకరణాల సహాయం తో అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించుతాడు. అవి - టెలివిజన్ తక్క్కువ కదలికతో ఉన్న ఆడిన దృశ్యం, బాల్ ట్రాకింగ్, ఏ స్నికోమీటర్ మొదలగునవి. ఒక బ్యాటర్ తన అవుట్ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ ప్రత్యర్థి బ్యాటర్ నాట్ అవుట్ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. ఒక్కో ఇన్నింగ్స్‌లో విఫలమైన సమీక్షల సంఖ్య జట్లు కి పరిమితంగా ఉంటుంది. తదుపరి సమీక్షలు అనుమతించబడవు. అంపైర్లు స్వయంగా రనౌట్, క్యాచ్, నో బాల్ నిర్ణయాలను సమీక్షించవచ్చు,