క్రిస్మస్ చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రిస్మస్ చెట్టు
డెన్మార్క్ లోని ఒక ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టు.

క్రిస్మస్ చెట్టు అనగా ఒక అలంకరించబడిన చెట్టు, సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి సతతహరిత కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ క్రిస్మస్ వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. నేడు ఈ చెట్టు అలంకరణలో మెరుగు కాగితాలు,, చెరుకు గడ్డలు వంటి వాటితో పాటు అనేక రకాల సంప్రదాయ అభరణాలను ఉపయోగిస్తున్నారు. దేవదూత గాబ్రియల్ లేదా బెత్లేహం స్టార్ సూచికగా చెట్టు పైభాగాన ఒక నక్షత్రాన్ని ఉంచుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

క్రిస్టమస్

బయటి లింకులు

[మార్చు]