Jump to content

క్రిస్ కెయిర్న్స్

వికీపీడియా నుండి
క్రిస్టోఫర్ కెయిర్న్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్రిస్టోఫర్ లాన్స్ కెయిర్న్స్
పుట్టిన తేదీ (1970-06-13) 1970 జూన్ 13 (వయసు 54)
పిక్టన్, న్యూజీలాండ్
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రఆల్ రౌండర్
బంధువులులాన్స్ కెయిర్న్స్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 168)1989 24 November - Australia తో
చివరి టెస్టు2004 13 June - England తో
తొలి వన్‌డే (క్యాప్ 76)1991 13 February - England తో
చివరి వన్‌డే2006 8 January - Sri Lanka తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.6
తొలి T20I2005 17 February - Australia తో
చివరి T20I2006 16 February - West Indies తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–2008Nottinghamshire
1988/89Northern Districts
1990/91–2005/06Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 62 215 217 424
చేసిన పరుగులు 3,320 4,950 10,702 10,367
బ్యాటింగు సగటు 33.53 29.46 35.32 32.60
100లు/50లు 5/22 4/26 13/71 9/55
అత్యుత్తమ స్కోరు 158 115 158 143
వేసిన బంతులు 11,698 8,168 16,620 16,620
వికెట్లు 218 201 647 455
బౌలింగు సగటు 29.40 32.80 28.31 27.99
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 13 1 30 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 6 0
అత్యుత్తమ బౌలింగు 7/27 5/42 8/47 6/12
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 66/– 78/– 118/–
మూలం: CricInfo, 2008 26 November

క్రిస్టోఫర్ లాన్స్ కెయిర్న్స్ (జననం 1970, జూన్ 13) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, మాజీ వన్డే కెప్టెన్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ఆల్ రౌండర్‌గా రాణించాడు. సదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

తన టెస్ట్ కెరీర్‌ను 33.53 బ్యాటింగ్ సగటు, 29.40 బౌలింగ్ సగటుతో ముగించాడు. 2000లో ఐదుగురు విజ్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 1992, 1996, 1999, 2003లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[1] 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ ట్రోఫీ ఫైనల్‌లో 102 నాటౌట్‌తో నిలిచాడు.

ఇతను న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ లాన్స్ కెయిర్న్స్ కుమారుడు. వన్డే, టెస్ట్ న్యూజీలాండ్ జట్లు రెండింటిలోనూ, అలాగే కాంటర్‌బరీ న్యూజీలాండ్ దేశీయ ఛాంపియన్‌షిప్ జట్టులోనూ ఆడాడు. ఆట నుండి విరమణ పొందిన తరువాత కెయిర్న్స్ స్కై స్పోర్ట్ న్యూజీలాండ్‌తో వ్యాఖ్యాతగా మారాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

1988 యూత్ క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు. ఇది అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్.[2] ఆ తర్వాత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1989, నవంబరు 24న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[3]

పదవీ విరమణ

[మార్చు]

కెయిర్న్స్ 2004లో న్యూజీలాండ్ టెస్ట్ జట్టు నుండి రిటైర్ అయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Chris Cairns: One of the greatest all-rounders the game has seen". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-06-13. Retrieved 2021-08-11.
  2. "RECORDS - MCDONALD'S BICENTENNIAL YOUTH WORLD CUP" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-12.
  3. "Full Scorecard of Australia vs New Zealand Only Test 1989/90 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2020. Retrieved 12 August 2021.
  4. "Chris Cairns to retire from Test cricket". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.

బాహ్య లింకులు

[మార్చు]