Jump to content

క్రొయేషియాలో హిందూమతం

వికీపీడియా నుండి
దేవనాగరిలో "ఓం" గుర్తు

క్రొయేషియాలో హిందూ మతం చిన్న మతం.

చరిత్ర

[మార్చు]

క్రొయేషియన్ పండితులలో ఇండాలజీపై ఆసక్తి ఉన్న దీర్ఘకాల సంప్రదాయం ఉంది. క్రొయేట్స్‌లో భారతీయ సంస్కృతిపై గొప్ప ఆసక్తి కూడా ఉంది.

1776 - 1789 మధ్యకాలంలో ట్రావెన్‌కోర్ మహారాజా ఆస్థానంలో ఉండే కార్మెలైట్ సన్యాసి పౌలినస్ ఎ శాంక్టో బార్తొలోమియో క్రొయేషియాకు చెందినవాడు. అతన్ని ఫిలిప్ వెస్డిన్ అని కూడా అనేవారు. అతను ఇండలాజికల్ అధ్యయనాలకు మార్గదర్శకుడు. సంస్కృత వ్యాకరణంపై ఒక పుస్తకంతో సహా భారతీయ సంస్కృతి పైన, ఇండో-యూరోపియన్ భాషల పైనా అనేక పుస్తకాలు రాశాడు. సంస్కృత వ్యాకరణంపై ఐరోపాలో ప్రచురించబడిన మొదటి పుస్తకం అది. [1] అతని పుస్తకాలు భారతీయ సంస్కృతిపై మరింత ఆసక్తిని, పరిశోధననూ ప్రేరేపించాయి.

జాగ్రెబ్ విశ్వవిద్యాలయం 250వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దాని లోని ఇండాలజీ విభాగం 1998 డిసెంబరు 17న సెమినార్ నిర్వహించింది. 1962లో క్రొయేషియా, జాగ్రెబ్ యూనివర్శిటీలో సెంటర్ ఫర్ ఇండాలజీని స్థాపించింది. ఇది చాలా చురుకుగా ఉంటూ, అత్యంత ప్రజాదరణ పొందింది. 50-60 మంది విద్యార్థులు ఇండాలజీని అభ్యసిస్తారు, ఇందులో హిందీ/సంస్కృతం నేర్చుకుంటారు. ప్రతి సంవత్సరం "హిందీ దినోత్సవం" జరుపుకోవడానికి భారత రాయబార కార్యాలయం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు/రిసెప్షన్‌లు నిర్వహిస్తారు.

క్రొయేషియాలోని ఇస్కాన్

[మార్చు]

క్రొయేషియాలో ISKCON కు అధికారికంగా తొమ్మిది కేంద్రాలున్నాయి. [2]

హరే కృష్ణ ఉత్సవం

క్రొయేషియా ప్రభుత్వం జాగ్రెబ్ మధ్యలో 500 చదరపు మీటర్ల స్థలాన్ని హరే కృష్ణ చేసే మానవత్వ కార్యక్రమాల కోసం ఇచ్చింది. [3]

క్రొయేషియాలోని ఇస్కాన్ కేంద్రాలు

[మార్చు]
  • ఇస్కాన్ ఒసిజెక్ - వైస్నవ్స్కా వ్జెర్స్కా జాజెడ్నికా ఒసిజెక్, ఒసిజెక్, క్రొయేషియా
  • నవ నిలకల ఫామ్, పులా, క్రొయేషియా
  • సంస్కృతి కేంద్రం భక్తివేదాంత, రిజేకా, క్రొయేషియా
  • ఇస్కాన్ స్ప్లిట్, స్ప్లిట్, క్రొయేషియాబ్
  • ఇస్కాన్, వరాజ్డిన్, క్రొయేషియా
  • సెంటార్ వేద, వోడిస్, క్రొయేషియా
  • ఇస్కాన్, జాదర్, క్రొయేషియా
  • సెంటర్ జాగ్రెబ్, జాగ్రెబ్, క్రొయేషియా
  • ఇస్కాన్ VVZ జాగ్రెబ్, జాగ్రెబ్, క్రొయేషియా

సమాజం

[మార్చు]

1994 జూన్ లో ఏర్పాటైన క్రొయేట్-ఇండియన్ సొసైటీ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, భారతీయ పురాణాల ఆధారంగా యానిమేషన్ చిత్రాలు, భారతదేశ సంప్రదాయాలపై వివిధ డాక్యుమెంటరీలతో సహా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూంటుంది. 2000 జనవరిలో డిప్లమాటిక్ అకాడమీ ఆఫ్ క్రొయేషియా, న్యూ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ (FSI) మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఏడుగురు క్రొయేషియన్ దౌత్యవేత్తలు న్యూ ఢిల్లీలోని ఎఫ్‌ఎస్‌ఐలో విదేశీ దౌత్యవేత్తల వృత్తిపరమైన కోర్సు (పిసిఎఫ్‌డి)కు హాజరయ్యారు. FSI లో సెక్రటరీ & డీన్ అయిన సంతోష్ కుమార్, 2003 సెప్టెంబరు 29-30 లో క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్‌లో జరిగిన డీన్స్ సమావేశానికి హాజరయ్యాడు.

సంస్కృత ఇతిహాసాలు, పురాణాలపై డుబ్రోవ్నిక్ అంతర్జాతీయ సమావేశం

[మార్చు]

సంస్కృత గాథలు, పురాణాలపై క్రొయేషియన్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2002 సెప్టెంబరు 2 నుండి 7 వరకు డుబ్రావ్నిక్‌లో మూడవ అంతర్జాతీయ సదస్సు (DICSEP3) జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 29 మంది ప్రముఖ సంస్కృత పండితులు దీనికి హాజరయ్యారు. అంతకుముందు, DICSEP 1 & DICSEP 1997 ఆగస్టు 2 న, 1999 ఆగస్టు లోనూ జరిగాయి. తదుపరి సమావేశం 2005 సెప్టెంబరు 5-10 మధ్య జరపాలని తలపెట్టారు. సంస్కృత ఇతిహాసాలు, పురాణాలపై ఐదవ డుబ్రోవ్నిక్ అంతర్జాతీయ సమావేశం 2008 ఆగస్టు 11 నుండి 16 వరకు షెడ్యూల్ చేయబడింది. 2008 సంవత్సరపు సాధారణ ఇతివృత్తం "సంస్కృత ఇతిహాసం, పౌరాణిక సంప్రదాయాలు, బ్రాహ్మణేతర గ్రంథాలూ సంప్రదాయాల మధ్య పరస్పర మార్పిడి". ఇందులో బ్రాహ్మణీయం/ హిందూమతం, కంపారిటివ్ స్టడీస్ ఉంటాయి.

ఇప్పటివరకు క్రొయేషియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ మొదటి 3 కాన్ఫరెన్సుల వివరాలను ఇంగ్లీషులో ప్రచురించింది. 1వ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ఒక్కటే మున్షీరామ్ మనోహర్‌లాల్ ద్వారా భారతదేశంలో విడుదల చేయబడింది. భారతదేశం నుండి ఒక్క పండితుడు కూడా ఈ సదస్సులకు హాజరు కాకపోవడం ఆసక్తికరం.

క్రొయేషియాలోని భారతీయ సంఘం

[మార్చు]

క్రొయేషియాలోని భారతీయ సంఘం పరిమాణంలో చిన్నది. క్రొయేషియాలో దాదాపు పదమూడు కుటుంబాలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "PAULINUS A SANCTO BARTHOLOMAEO, [Johannes Philippus Werdin or Wesdin].India Orientalis Christiana continens fundationes ecclesiarum, seriem episcoporum, missiones, schismata, persecutiones, reges, viros illustres". Horden House. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 16 జనవరి 2022. Paulinus a S. Bartholomaeo (1748-1806).....He was the author of many learned studies on the east, and published the first Sanskrit grammar
  2. "ISKCON సెంటర్స్ - క్రొయేషియా". centers.iskcondesiretree.com/croatia/.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "WWRNews". Archived from the original on 2007-09-30. Retrieved 2007-02-27.