క్రొవ్విడి లక్ష్మన్న
స్వరూపం
క్రొవ్విడి లక్ష్మన్న బహుభాషా కోవిదులు, రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1917 ఫిబ్రవరి 6న విజయనగరంలో జన్మించాడు. అతను ఆంధ్రా విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలలో విద్యాభ్యాసం చేసాడు. ఎం.ఎ, బి.ఎల్ డిగ్రీలను చేసాడు[2]. భారత ప్రభుత్వ కార్యాలయం, ఢిల్లీలో 1942 ఉద్యోగం చేశాడు. అతను తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో కూడా పండితుడు. అతను సంస్కృత నాటకాలపై ఆంగ్లంలో గ్రంథం ప్రచురించాడు. అతను విదేశాలలో పర్యటించి సందర్శన విశేషాలను వ్యాసాలుగా ప్రచురించాడు.
రచనలు
[మార్చు]తెలుగు
[మార్చు]- ఆద్యంతాలు
- ఉబలాటం
- కాలం మారాలి (1965)[3]
- తేనెపట్టు[4]
- పట్టు చొక్కా
- కోర్టు మార్షల్[5]
- హనోయ్ విశేషాలు
- కంభోడియా విశేషాలు (యాత్రా వర్ణన);1956
- ద స్టాటస్ ఆఫ్ ద ఏన్సియెంట్ సాంస్క్రీట్ డ్రామా; 1939
- ఇంట్రడక్షన్ టు ద పోయెమ్స్ ఆఫ్ డా.పోస్ట్ వీలర్; 1940
మూలాలు
[మార్చు]- ↑ "హవ్వ! అవ్వేది?". Sakshi. 2018-07-16. Retrieved 2020-06-14.
- ↑ 2.0 2.1 Akademi, Sahitya. Whos Who Of Indian Writers (in ఇంగ్లీష్). Dalcassian Publishing Company.
- ↑ Lakshmanna, Krovvidi (1965). Kālaṃ mārāli. Dēśī Buk Ḍisṭribyūṭarsu.
- ↑ Lakshmanna, Krovvidi (1966). Tēnepaṭṭu. Dēśī Buk Ḍisṭribyūṭarsu.
- ↑ "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.
బాహ్య లంకెలు
[మార్చు]- "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-14.