Jump to content

క్లార్క్ గేబుల్

వికీపీడియా నుండి
క్లార్క్ గేబుల్
1940లో గేబుల్ పబ్లిక్ పోర్ట్రయిట్
జననంవిలియమ్ క్లార్క్ గేబుల్
(1901-02-01)1901 ఫిబ్రవరి 1
కడిజ్, ఓహియో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం1960 నవంబరు 16(1960-11-16) (వయసు 59)
లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విశ్రాంతి ప్రదేశంఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, గ్లెండాల్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఇతర పేర్లుద కింగ్ ఆఫ్ హాలీవుడ్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1918–1960
రాజకీయ పార్టీరిపబ్లికన్
భార్య / భర్త
జోసెఫైన్ డిల్లాన్
(m. 1924; div. 1930)
మరియా లాన్హమ్
(m. 1931; div. 1939)
కరోల్ లాంబర్డ్
(m. 1939; died 1942)
సిల్వియా యాష్లే
(m. 1949; div. 1952)
కే విలియమ్స్
(m. 1955)
పిల్లలుజూడీ లూయీస్ సహా 2
బంధువులుక్లార్క్ జేమ్స్ గేబుల్ (మనవడు)
సంతకం
Military career
రాజభక్తిఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
సేవలు/శాఖ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్
యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌ఫోర్స్
సేవా కాలం1942–1947[1]
ర్యాంకు మేజర్
యూనిట్351 బాంబ్ గ్రూప్, ఫస్ట్ మోషన్ పిక్చర్ యూనిట్
పోరాటాలు / యుద్ధాలురెండవ ప్రపంచ యుద్ధం
పురస్కారాలు డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్
ఎయిర్ మెడల్
అమెరికన్ క్యాంపైన్ మెడల్
యూరోపియన్–ఆఫ్రికన్–మిడిల్ ఈస్టర్న్ కాంపైన్ మెడల్
వరల్డ్ వార్ 2 విక్టరీ మెడల్

విలియం క్లార్క్ గేబుల్ (1901 ఫిబ్రవరి 1 – 1960 నవంబరు 16) అమెరికన్ సినిమా నటుడు. ఇతనికి ది కింగ్ ఆఫ్ హాలీవుడ్ అన్న బిరుదు ఉంది, [2] 37 సంవత్సరాల పాటు కొనసాగిన కెరీర్‌లో 60కి పైగా సినిమాల్లో రకరకాల తరహాల పాత్రలు పోషించాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో 30 ఏళ్ళ పాటు కథానాయక (ప్రధాన) పాత్రల్లోనే కనిపించాడు. గేబుల్ 59 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. 1961లో తన మరణానంతరం విడుదలైన ద మిస్‌ఫిట్స్‌లో వయసు మళ్ళిన కౌబాయ్‌గా చేసిన పాత్ర అతని చివరి పాత్ర.

హాలీవుడ్ చరిత్రలోనే బాక్సాఫీస్ వద్ద అత్యంత నిలకడగా మంచి కలెక్షన్లు రాబట్టిన స్టార్‌లలో గేబుల్ ఒకడు. ఈ కారణంగానే క్విగ్లే పబ్లిషింగ్ ఏటా ప్రచురించే టాప్ టెన్ మనీ మేకింగ్ స్టార్స్ పోల్‌లో 16 సార్లు స్థానం సంపాదించాడు. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన గ్రేటెస్ట్ మేల్ మూవీ స్టార్స్ ఆఫ్ క్లాసిక్ అమెరికన్ సినిమా జాబితాలో ఏడవ స్థానం పొందాడు.[3] ఆ కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణులందరితోనూ అతను నటించాడు. జోన్ క్రాఫోర్డ్‌తో నటించడానికి క్లార్క్ గేబుల్ బాగా ఇష్టపడేవాడు. ఆమెతో మొత్తం ఎనిమిది సినిమాల్లో నటించాడు.[4] అతనితో మైర్నా లాయ్ ఏడు సినిమాల్లోనూ, జేన్ హార్లోతో ఆరు సినిమాల్లోనూ జంటగా నటించారు. లానా టర్నర్‌తో నాలుగు సినిమాలు, నార్మా షేరర్, అవా గార్డ్‌నెర్‌లతో మూడేసి సినిమాలు కలసి నటించాడు.

క్లార్క్ గేబుల్ 1901 ఫిబ్రవరి 1న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించాడు. చిన్నతనంలోనే అతని తల్లి చనిపోతే తండ్రి మరోపెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి అతన్ని ఆదరించి పెంచింది.[5] తండ్రికి ఆర్థిక సమస్యలు ఎదురై వ్యవసాయంలో దిగాకా తనతో పాటు క్లార్క్‌ని పొలంలో పనిచేయమంటే కాదని ఉద్యోగం కోసం పదహారేళ్ళ వయసులో టైర్ల కంపెనీలో పనిచేయడానికి వెళ్ళాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Maj. Clark Gable National Museum of the United States Air Force. Retrieved October 5, 2019.
  2. "Clark Gable: King of Hollywood". The Huffington Post. Retrieved April 22, 2014.
  3. "America's Greatest Legends" (PDF). American Film Institute. Archived (PDF) from the original on 2022-10-09. Retrieved July 29, 2009.
  4. Spicer, Chrystopher (2002). Clark Gable: Biography, Filmography, Bibliography. Jefferson, North Carolina: McFarland & Company. ISBN 978-0-7864-1124-5.
  5. Todd E. Creason (2009). Famous American Freemasons, Volume 2. p. 92. ISBN 978-0-557-07088-6. Retrieved June 2, 2017.
  6. Jordan, Elisa (October 22, 2018). Rockhaven Sanitarium: The Legacy of Agnes Richards (in ఇంగ్లీష్). Arcadia Publishing. ISBN 978-1-4396-6558-9.