క్లోజప్ (1990 సినిమా)
Jump to navigation
Jump to search
క్లోజప్ 1990లో విడుదలైన ఇరాన్ డాక్యుమెంటరీ సినిమా. ఇరాన్ దర్శకుడు అబ్బాస్ కైరోస్తమీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రసంశలు అందుకొని 50 ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[1] చాలామంది ప్రపంచ సినిమా యొక్క ఉత్తమ రచన ఎంపికచేయబడింది.[2][3]
కథా నేపథ్యం
[మార్చు]చలనచిత్ర దర్శకుడు మొహ్సెన్ మఖల్బఫ్ మాదిరిగా నటించిన వ్యక్తి యొక్క నిజ జీవితకథతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో చాలావరకు నిజజీవిత పాత్రలే ఉన్నాయి. మానవ ఉనికికి సంబంధించిన ఈ చిత్రం పశ్చిమ దేశాలలో అబ్బాస్ కైరోస్తమీకి గుర్తింపు పెరగడానికి ఉపయోగపడింది.
నటవర్గం
[మార్చు]- హుస్సేన్ సబ్జియాన్
- మొహ్సెన్ మఖల్బఫ్
- అబ్బాస్ కైరోస్తమీ
- అబోల్ఫజల్ అహంఖా
- మెహర్దాద్ అహంఖా
- మోనోచెహర్ అహంఖా
- మహ్రోఖ్ అహంఖా
- హజ్ అలీ రెజా అహ్మద్
- నాయర్ మొహ్సేని జోనూజీ
- అహ్మద్ రెజా మొయీద్ మొహ్సేని
- హుస్సేన్ ఫరాజ్‌మండ్
- హూషాంగ్ షమై
- మహ్మద్ అలీ బర్రతి
- దావూద్ గుడార్జీ
- హసన్ కొమైలి
- దావూద్ మొహబ్బత్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: అబ్బాస్ కైరోస్తమీ
- నిర్మాత: అలీ రెజా జార్రిన్, అబ్బాస్ కైరోస్తమీ
- ఛాయాగ్రహణం: అలీ రెజా జరిందాస్ట్
- కూర్పు: అబ్బాస్ కైరోస్తమీ
- నిర్మాణ సంస్థ: కానూన్
- పంపిణీదారు: సెల్యులాయిడ్ డ్రీమ్స్
అవార్డులు
[మార్చు]- 1990: మాంట్రియల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ న్యూ సినిమా అండ్ వీడియో: క్యూబెక్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
- 1992: అంతర్జాతీయ ఇస్తాంబుల్ ఫిల్మ్ ఫెస్టివల్: ఫిప్రెస్సీ ప్రైజ్
- 1996: టొరినో ఫిల్మ్ ఫెస్టివల్: ఫిప్రెస్సీ ప్రైజ్[4][5]
ఇతర వివరాలు
[మార్చు]మార్కస్ సోడెర్లండ్ 2007లో విడుదలచేసిన మ్యూజిక్ వీడియో "ఎ న్యూ ఛాన్స్"లో మోటారు సైకిల్‌పై వెళ్ళే షాట్ ను ఈ సినిమాలో ఉన్నవిధంగా మళ్ళీ చిత్రీకరించింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "The Top 50 Greatest Films of All Time". Sight & Sound. British Film Institute. 1 August 2012. Retrieved 24 June 2019.
- ↑ Holden, Stephen, "Close Up (1990) FILM REVIEW; The Pathos Of Deceit By a Victim Of Longing." The New York Times, December 31, 1999, Accessed on 24 June 2019
- ↑ Lim, Dennis, "A Second Look: Abbas Kiarostami's 'Close-Up'." The Los Angeles Times, June 9, 2010, Accessed on 24 June 2019
- ↑ "Close-Up Long Shot (Forum, Film Festival Berlin 1997)". arsenal-berlin.de. Retrieved 24 June 2019.
- ↑ "Torino Film Festival". torinofilmfest.org. Retrieved 24 June 2019.
- ↑ The Tough Alliance - A New Chance. 3 September 2007. Retrieved 24 June 2019 – via YouTube.
- ↑ YouTube. youtube.com. Retrieved 24 June 2019.