Jump to content

క్షితిజ్ ఠాకూర్

వికీపీడియా నుండి
క్షితిజ్ ఠాకూర్
క్షితిజ్ ఠాకూర్


పదవీ కాలం
2009 – 2024
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
తరువాత రాజన్ నాయక్
నియోజకవర్గం నలసోపరా

వ్యక్తిగత వివరాలు

జననం (1983-07-10) 1983 జూలై 10 (వయసు 41)
దేవ్‌గావ్ , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బహుజన్ వికాస్ అఘాడి
తల్లిదండ్రులు
  • హితేంద్ర ఠాకూర్
  • ప్రవీణ ఠాకూర్
జీవిత భాగస్వామి ప్రాచీ గల్వంకర్ (మ.2012)[1][2]
పూర్వ విద్యార్థి యూనివర్శిటీ ఆఫ్ ముంబై
హార్వర్డ్ యూనివర్సిటీ
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ
బాల్డ్‌విన్ వాలెస్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

క్షితిజ్ ఠాకూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కల్వాన్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

క్షితిజ్ ఠాకూర్ తన తండ్రి బహుజన్ వికాస్ అఘాడి పార్టీ వ్యవస్థాపకుడు హితేంద్ర ఠాకూర్ అడుగుజాడల్లో 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బివిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి శిరీష్ చవాన్‌పై 40,782 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బివిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌పై 54,499 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

క్షితిజ్ ఠాకూర్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బివిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ప్రదీప్ శర్మపై 43,729 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బివిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి రాజన్ నాయక్ చేతిలో 36,875 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Legislator among 1,034 couples in Maharashtra's biggest mass marriage". Deccan Herald. 29 January 2012. Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  2. "MLA ties knot at mass marriage in Virar". DNA India. 30 January 2012. Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  5. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  6. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  7. India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  8. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  9. "Maharastra Assembly Election Results 2024 - Nallasopara". Election Commission of India. 23 November 2024. Archived from the original on 24 December 2024. Retrieved 24 December 2024.