Jump to content

క్సేనియా కరేలీనా

వికీపీడియా నుండి
క్సేనియా కరేలీనా
Ксения Карелина
జననం
యెకాటెరిన్‌బర్గ్, రష్యా
జాతీయతఅమెరికా - రష్యన్ పౌరురాలు
పౌరసత్వంరష్యా
యునైటెడ్ స్టేట్స్
వృత్తిబాలెట్ డాన్సర్
నేరారోపణ(లు)దేశద్రోహం
శిక్ష12 ఏళ్ల జైలు శిక్ష
Criminal statusజైలు శిక్ష అనుభవిస్తున్నది

సేనియా కరేలినా (ఆంగ్లం: Ksenia Karelina) ఒక రష్యన్-అమెరికన్ బ్యాలెట్ డ్యాన్సర్, ఈమె రష్యా ప్రభుత్వంచే దేశద్రోహానికి పాల్పడినందుకు జైలు పాలైంది.[1] రష్యన్ ఫెడరేషన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) ఆమె కైవ్ పాలన (Kyiv regime)కు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది.[2] ఈ విషయాన్ని రష్యా చాలా తీవ్రంగా పరిగణించింది. ఫలితంగా ఆమె జైలు జీవితం ఎదుర్కొంటోంది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

కరేలీనా రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో జన్మించింది.[4] 2012లో, ఆమె యునైటెడ్ స్టేట్స్‌కు వలసవెళ్లింది, అక్కడ 2021లో పౌరసత్వం పొందింది.[5] ఆమె గతంలో లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉండేది.

నేరారోపణ

[మార్చు]

క్సేనియా కరేలీనాను జనవరి 2024న యెకాటెరిన్బర్గ్ లో రష్యన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శత్రుదేశం ఉక్రెయిన్ కు సహాయం చేసే న్యూయార్క్ నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థకు క్సేనియా కరేలీనా కేవలం 51 డాలర్లు (సుమారు రూ.4200) విరాళం ఇవ్వడంతో రష్యన్ ప్రభుత్వం ఆమెపై రాజద్రోహం అభియోగాలు మోపింది, ఆమె 2024 ఆగస్టు 7న నేరాన్ని అంగీకరించింది.[6] 2024 ఆగష్టు 15న, ఆమెకు స్వెర్డ్లోవ్స్క్, యెకాటెరిన్బర్గ్ ప్రాంతీయ కోర్టులు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి.[7]

మూలాలు

[మార్చు]
  1. "Russia Arrests Dual U.S. Citizen on Accusations of Treason". TIME. February 20, 2024.
  2. Edwards, Christian (2024-06-20). "Russian court begins hearing treason case against US-Russian citizen". CNN (in ఇంగ్లీష్). Retrieved 2024-08-03.
  3. "Russia: డ్యాన్సర్‌కు రష్యా కఠిన శిక్ష.. ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు 12 ఏళ్లు జైలు - NTV Telugu". web.archive.org. 2024-08-15. Archived from the original on 2024-08-15. Retrieved 2024-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Treason trial of Russian American woman opens as tensions rise between Washington and Moscow". Associated Press. Moscow. June 20, 2024.
  5. "U.S.-Russian citizen Ksenia Karelina pleads guilty to treason, state media says". Reuters. Yekaterinburg. August 7, 2024.
  6. Stapleton, Ivana Kottasová, AnneClaire (2024-08-07). "Russian-American woman admits guilt in treason case, Russian state media reports". CNN (in ఇంగ్లీష్). Retrieved 2024-08-07.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  7. "Ksenia Karelina: US-Russian woman jailed in Russia for 12 years for treason". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-08-15.