ఖగెన్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖగెన్ దాస్

పదవీ కాలం
2002-2014
ముందు సమర్ చౌదరి
తరువాత శంకర్ ప్రసాద్ దత్తా
నియోజకవర్గం త్రిపుర పశ్చిమ

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1998-2002

త్రిపుర రాష్ట్ర రెవెన్యూ, ఆరోగ్యం & గణాంకాల శాఖ మంత్రి
పదవీ కాలం
1983-1988

పదవీ కాలం
1978-1988

వ్యక్తిగత వివరాలు

జననం (1937-09-04)1937 సెప్టెంబరు 4
కొమిల్లా , భారతదేశం
మరణం 2018 జనవరి 21(2018-01-21) (వయసు 80)
కోల్‌కతా
రాజకీయ పార్టీ సీపీఐ (ఎం)
జీవిత భాగస్వామి అనుపమా దాస్
సంతానం 2 కుమార్తెలు
నివాసం అగర్తల
మూలం [1]

ఖగెన్ దాస్ (4 సెప్టెంబర్ 1937 - 21 జనవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన త్రిపుర శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి, త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఖగెన్ దాస్ మజ్లిష్‌పూర్ నియోజకవర్గం నుండి 1978 నుండి 1988 వరకు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 1983 నుండి 1988 వరకు రాష్ట్ర ఆరోగ్య, గణాంకాలు & రెవెన్యూ మంత్రిగా పని చేశాడు. ఆయన 1993 నుండి 1998 వరకు అప్పటి త్రిపుర ముఖ్యమంత్రి దశరథ్ దేబ్‌కు రాజకీయ కార్యదర్శిగా పని చేశాడు. ఖగెన్ దాస్ 1998 నుండి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆ తరువాత త్రిపుర పశ్చిమ నుండి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2006లో త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్‌గాఎన్నికై మరణించే వరకు ఆ హోదాలో పని చేశాడు.

మరణం

[మార్చు]

ఖగెన్‌ దాస్‌ సీపీఎం పార్టీ మూడు రోజుల సెంట్రల్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు కోల్‌కతాలో వెళ్లగా 21 జనవరి 2018న ఛాతీ నొప్పి రావడంతో ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు గుండెపోటుతో మార్గమధ్యలో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (21 January 2018). "Veteran CPI (M) leader Khagen Das dies at 80, body to be donated to Tripura medical college" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  2. "Veteran CPI-M leader, ex-MP Khagen Das dead" (in ఇంగ్లీష్). 21 January 2018. Retrieved 28 September 2024.