Jump to content

ఖజ్రానా గణేష్ దేవాలయం

వికీపీడియా నుండి
ఖజ్రానా గణేష్ దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మధ్య ప్రదేశ్
జిల్లా:ఇండోర్
ప్రదేశం:ఇండోర్

ఖజ్రానా వినాయక దేవాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం. ఈ దేవాలయం హోల్కర్ రాజవంశం పాలనలో నిర్మించబడింది.[1]

చరిత్ర

[మార్చు]

1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి సురక్షితంగా ఉంచడానికి వినాయకుని విగ్రహాన్ని బావిలో దాచిపెట్టగా తరువాత వెలికితీయబడింది.[2] భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు నేరవేరాలని ఒక దారం కడుతారు. దేవాలయంలోని పురాతన విగ్రహం స్థానిక పూజారి పండిట్ మంగళ్ భట్ కలలో కనిపించిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబం నిర్వహిస్తోంది.[2]

ఖజ్రానా దేవాలయ భవనం

అభివృద్ధి

[మార్చు]

చిన్న గుడి నుంచి ఆధునిక దేవాలయం వరకు ఏళ్లుగా ఇది అభివృద్ధి చెందింది. దేవాలయానికి విరాళాల రూపంలో డబ్బు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలు అందుతాయి.[3] గర్భగృహ ద్వారం, బయటి, పై గోడలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై వివిధ పండుగల చిత్రాలు చెక్కబడ్డాయి. ఇండోర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త దానం చేసిన వజ్రాలతో దేవత కళ్ళు తయారు చేయబడ్డాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Grand gate to welcome devotees to Khajrana Temple soon, 17 November 2014, The Times of India.
  2. 1 2 "Khajrana Temple". Govt of Madhya Pradesh.
  3. Rs 5.75 cr facelift for Khajrana Ganesh temple, 2 September 2013, DNA India.
  4. जहां बनाया जाता है उल्टा स्वास्तिक, 30 April 2016, Vibrant4travel.

బయటి లింకులు

[మార్చు]