ఖిల్లా రామాలయం
ఖిల్లా రామాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 18°23′31″N 78°06′04″E / 18.392°N 78.101°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
సంస్కృతి | |
దైవం | రాముడు |
ఖిల్లా రామాలయం నిజామాబాదు జిల్లాలో ‘ఇందూరు ఖజూరహో’ దేవాలయంగా పేరుగాంచింది.[1]
విశేషాలు
[మార్చు]సమర్ధ రామదాస్ అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథ ఆలయం నిజామబాదు నగరానికి తలమానికంగా నిలిచింది.[1] ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రానికి హైదరాబాదుకు వెళ్ళే దారిలో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 16 వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. ఇది కొండపైన కోటలో వున్నది. ఈ ఆలయానికి 108 మెట్లు ఉన్నాయి. దీనిని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు కట్టినట్లుగా చారిత్రిక కథనం.[2] ఈ ఆలయాన్ని నిర్మించినా ఏ విగ్రహమూ ఏర్పాటు చేయలేదు. జూలై 15 1949 లో గజవాడ చిన్నయ్య గుప్త నేతృత్వంలో గ్రామస్థులు జైపూర్ నుండి సీతారాముల పాలరాతి విగ్రహాలను తెప్పించి ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతీ యేటా ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమికి, మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ఏడు రోజులు బ్రహ్మోత్సవాలు, పౌర్ణమినాడు రథోత్సవం నిర్వహిస్తారు. ఇక ఆలయం చుట్టూ పచ్చని ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఆలయంపైన ఉన్న శిల్ప సంపద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇందూరు ఖజొరహో
[మార్చు]నిజామాబాదు కు 17 కి.మీ. దూరంలో గల డిచ్‌పల్లిని "దక్షిణ భారత దేశ ఖజురహో" అని అభివర్ణిస్తారు చరిత్రకారులు. డిచ్ పల్లి లో రామాలయం ప్రసిద్ది చెందినది. దీనినే 'ఇందూరు ఖజురహో' గా కూడా పిలుస్తారు. దేవాలయ శిల్ప సంపద అచ్చం ఖజురహో ను పోలి ఉంటుంది. ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి చూడటానికి చిన్నదే అయినప్పటికీ శిల్ప, వాస్తు కళలు అద్భుతంగా ఉంటాయి. ఆలయ గోడలు, పై కప్పు, ద్వారాలు చూపరులను ఆకట్టుకుంటాయి. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆలయం పై తురుష్కులు దాడి చేశారు. శిల్ప సంపద ను ధ్వంసం చేశారు. ఆలయం అసంపూర్తిగానే మిగిలింది. దాంతో ఈ గుడి కి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు. తురుష్కుల దండయాత్ర తరువాత అంత వరకు గుడిలో ఎటువంటి విగ్రహాలు ఉండేవి కావు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ప్రధాన దేవాలయాలు - నిజామాబాద్ - ఈనాడు - ప్రధాన దేవాలయాలు". Archived from the original on 2016-11-04. Retrieved 2017-09-16.
- ↑ నిజామాబాదు జిల్లా చరిత్ర[permanent dead link]
- ↑ దక్షిణ భారతదేశ ఖజురహో - డిచ్ పల్లి, తెలంగాణ