గంగరావి

వికీపీడియా నుండి
(గంగరేని నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గంగరావి
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
టి. పాపుల్నియా
Binomial name
థెస్పీసియా పాపుల్నియా
(L.) Sol ex Correa
Thespesia populnea

గంగరావి లేదా గంగరేణి (Thespia populnea) పెద్ద సతత హరిత వృక్షం. 'థెస్పియా' అంటే గ్రీకు భాషలో దైవ సంబంధమైన అని అర్థం. 'పాపుల్నియా' అంటే ఆకుల త్రికోణాకృతిని బట్టి వచ్చిన పదం. దీని పూలు బెండ పూలలా ఉంటాయి. దీనిని 'భారతీయ తులిప్ వృక్షం' అని కూడా అంటారు.

లక్షణాలు

[మార్చు]
  • ఇది పెద్ద సతత హరిత వృక్షం. చెట్టు నున్నగా బూడిద రంగులో పొడుగా ఉండి కొమ్మలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
  • ఆకులు: హృదయాకార నిర్మాణం గల కేశరహిత సరళ పత్రాలు. చివరలు రావి ఆకులా మొనదేలి ఉంటాయి. రెండువైపులా ఆకుమీద చిన్న బూడిద రంగు మచ్చలుంటాయి.
  • పువ్వులు: గ్రీవస్థంగా ఏకాంతరంగా ఏర్పడిన పెద్ద పసుపు రంగు పుష్పాలు. ఇవి ఒకటి లేదా జతలుగా పూస్తాయి. తులిప్ పువ్వుల మాదిరి గిన్నెలా ఉండి, వాటిమధ్య మామిడి చిగురు రంగుంటుంది. రేకులు వంకరలు తిరిగి ఉంటాయి.
  • పండు: దీర్ఘకాలిక రక్షక పత్రావళిలో అమరి ఉన్న గుండ్రని ఫలం. తలపాగా ఆకారంలో ఉండే కాయల్లో అయిదు బాగాలుంటాయి. ఒక్కో భాగంలో ముదురు ఆకుపచ్చ నుండి నలుపు రంగు గింజలుంటాయి.

ఉపయోగాలు

[మార్చు]
గంగరావి కాయలు. (వనస్థలి పురం)
  • గంగరావి కలపను బండి చక్రాలకు, పడవలకు, ఇళ్ళకు ఉపయోగిస్తారు.
  • బెరడు నుంచి వచ్చే ద్రవాన్ని ఎర్ర రంగు, పువ్వులు/కాయలు నుంచి పసుపు రంగు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
  • లోపలి బెరడు నుంచి తీసే పీచుతో తాళ్ళు, గోనె సంచులు తయారుచేస్తారు.
  • ముదురు కాండం తవిల్ అనే ఒక రకం మృదంగం తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
  • పువ్వులు, కాయలు నుంచి చర్మవ్యాధుల కోసం, పార్శ్వ్పు నొప్పి కోసం ఔషధాలను తయారుచేస్తారు.
  • ఆకులను తినుబండారాలు పొట్లం కట్టడానికి ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  • Thespesia populnea at website: Australian native hibiscus and hibiscus-like species.
  • Binggeli, Pierre. 1999. Miro
"https://te.wikipedia.org/w/index.php?title=గంగరావి&oldid=2980360" నుండి వెలికితీశారు