గంటెల మరియమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో అనాథ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న మానవతామూర్తి గంటెల మరియమ్మ. అక్షరం ముక్కరాని సాదారణ మహిళ. రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో ఎవరూ లేక, ముద్దపెట్టే దిక్కులేక గువ్వల్లా ముడుచుకుపోయి అనాథల్లా పడివు న్న వృద్ధ్దులను చూసి వాళ్ళను ఆదరిస్తోంది. భర్త రైల్వేలో నాల్గవ తరగతి ఉద్యోగి. 1992లో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి పీవీ నరసింహారావును కలిసింది. అసలు తెలుగైనా సక్రమంగా మాట్లాడటం రాని మహిళ అంత దూరం రావటం చూసి అబ్బురపడిన పీవీ ప్రతిరోజూ 25 మందికి భోజనం పెట్టేందుకు గ్రాంటు మంజూరు చేయించారు. పసుపు కుంకాల కింద తల్లిదండ్రులిచ్చిన రెండున్నర ఎకరాల భూమిని అమ్మి మరియమ్మ వృద్ధాశ్రమం నిర్మించింది. నాడు కేవలం 25 మందితో ప్రారంభమైన ఆశ్రమంలో ప్రస్తుతం 60 మంది ఉంటున్నారు. వృద్దులు చనిపోతే వాళ్లకు ఆమే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తోంది.