గండికోట గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గండికోట గోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన భౌతిక రసాయన శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కాకినాడ సమీప గ్రామం పిఠాపురం లో నవంబరు 11 1908 లో జన్మించారు. ఆంధ్రా యూనివర్శిటీలోనే భౌతిక రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసి డి.ఎస్.సి పట్టాను పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే రీదరు గా (1938) , ప్రొఫెసరు గా (1946) , శాఖాధిపతిగా (1949-68) ఉండి, ఎమిరిటస్ ప్రొఫెసరుగా కూడా రసాయన సాస్థ శాఖకు విశేష సేవలందించారు.[1] 1957 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సి లో వైశ్లేషిక రసాయన సాస్త్ర విభాగాన్ని ప్రారంచినప్పుదు మొదటి అధ్యాపకుడు ప్రొఫెసర్ గోపాలరావు.[2] భౌతిక రసాయన శాస్త్రములో, గతిక శాస్త్రంలో, కాంతి రసాయన అంశాలలో పరిశోధనలు చేశారు. సాధారణంగా ఏక దిశలో జరిగే మూలక రసాయన చర్యలను తిరోగమనం చెందించే పరిస్థితులను సృష్టించారు. కాంతి రసాయన చర్యలను అనువర్తింపజేసి రసాయన విశ్లేషణంలో నుతన గవాక్షాలను తెరిచారు. సజల పాస్ఫారికామ్ల ఎసిటికామ్ల మాధ్యమంలో ఈయన రూపొందించిన రిడాక్స్ ఘనపరిమాణాత్మక విశ్లేషణ పద్ధతుల వలన వాని మిశ్రమాల నిర్ణయం తేటతెల్లమై సరళమైంది. పలు విదేశాలలో పరిశీలనలు కొనసాగించి, నిర్థారించి అంగీకరింపజేశారు. జాతీయ అంతర్జాతీయ కెమిస్ట్రీ జర్నల్స్ లో 240 పరిశోధనా పత్రాలను వెలువరిచ్మారు. దేశ విదేశీ యూనివర్శిటీలలో వైజ్ఞానిక సంస్థలలో గౌరవ పదవులను అందుకున్నారు. ఈయన పర్యవేక్షణలో 34 మంది డాక్టరేట్ పట్టాలు అందుకుని ప్రసిద్ధ శాస్త్రవేత్తలయ్యారు. 1982 లో విశాఖపట్నంలో మృతి చెందారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]