Jump to content

గణపతి నరేష్ పట్వారీ

వికీపీడియా నుండి
గణపతి నరేష్ పట్వారీ
జననం (1972-12-13) 1972 డిసెంబరు 13 (వయసు 52)
బోధన్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
నివాసంముంబై, మహారాష్ట్ర
రంగములు
  • స్పెక్ట్రోస్కోపీ
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలు
ప్రసిద్ధిమాలిక్యులర్ క్లస్టర్లపై అధ్యయనాలు
ముఖ్యమైన పురస్కారాలు

గణపతి నరేష్ పట్వారీ, తెలంగాణకు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయిలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్. వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీపై అధ్యయనం చేశాడు.[1] రసాయనశాస్త్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నాడు.

జననం, విద్య

[మార్చు]

నరేష్ పట్వారీ 1972 డిసెంబరు 13న[2] తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో జన్మించాడు.[3] తన స్వగ్రామంలోనే ప్రారంభ పాఠశాల విద్యను చదివి,[4] 1992 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎస్సీ పూర్తిచేశాడు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చేరి 1994లో[5] మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సీ) పూర్తి చేశాడు.

పరిశోధన

[మార్చు]

2000లో పిహెచ్,డి.లో చేరి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో డాక్టరల్ పరిశోధన కొనసాగించాడు. 2000-02 సమయంలో జపాన్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్ ద్వారా అందించబడిన ఫెలోషిప్‌పై తోహోకు విశ్వవిద్యాలయంలో, 2003లో అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ వర్క్ చేసాడు. నరేష్ పట్వారీ పరిశోధనలు అనేక వ్యాసాల ద్వారా డాక్యుమెంట్ చేయబడ్డాయి, రీసెర్చ్‌గేట్ అనే ఆన్‌లైన్ ఆర్టికల్ రిపోజిటరీ ఆఫ్ సైంటిఫిక్ ఆర్టికల్స్ వాటిలో జాబితాలు చేయబడ్డాయి.[6] అనేక సెమినార్లలో ప్రసంగాలు, పత్ర సమర్పణలు చేశాడు.[7][8]

ఉద్యోగం

[మార్చు]

2003లో భారతదేశానికి తిరిగివచ్చి, 2003 ఏప్రిల్ నెలలో బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. 2007లో అసోసియేట్ ప్రొఫెసర్ గా మారి, 2012లో ఆచార్య హోదా పొందాడు.[5]

అవార్డులు

[మార్చు]

సైంటిఫిక్ రీసెర్చ్ కోసం భారత ప్రభుత్వ అత్యున్నత ఏజెన్సీ నుండి 2017 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు,[9] రసాయన శాస్త్రాలకు చేసిన కృషికి గానూ అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటైన సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నాడు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. "Handbook of Shanti Swarup Bhatnagar Prize Winners" (PDF). Council of Scientific and Industrial Research. 2017-10-17. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 2022-08-30.
  2. "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. 2017-10-21. Retrieved 2022-08-30.
  3. "Vice‐Chancellor's Address at the XIX Convocation held on October 1, 2017" (PDF). University of Hyderabad. 2017. Retrieved 2022-08-30.[permanent dead link]
  4. "Prof. G. Naresh Patwari From IIT Bombay Selected For Shanti Swarup Bhatnagar Prize 2017". Maha Politics. 28 September 2017. Retrieved 2022-08-30.
  5. 5.0 5.1 "Biographical Information - Naresh Patwari". Indian Institute of Technology, Bombay. 2017-11-09. Retrieved 2022-08-30.
  6. "On ResearchGate". 2017-11-11. Retrieved 2022-08-30.
  7. Single-Molecule Metal-Induced Energy Transfer: From Basics to Applications. Springer. 19 July 2017.
  8. "Confirmed Speakers". Indian Association for the Cultivation of Science. 2017. Retrieved 2022-08-30.
  9. 9.0 9.1 "View Bhatnagar Awardees". Shanti Swarup Bhatnagar Prize. 2017. Retrieved 2022-08-30.
  10. "10 scientists receive Shanti Swarup Bhatnagar Prize". The Hindu. 26 September 2017. Retrieved 2022-08-30.

మరింత చదవడానికి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]