గరికపాటి మోహన్ రావు
గరికపాటి మోహన్ రావు | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 10 జూన్ 2014 – 9 జూన్ 2020 | |||
తరువాత | సురేష్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | తెలంగాణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వరంగల్, తెలంగాణ | 1948 జనవరి 5||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | గరికపాటి సుజాత |
గరికపాటి మోహన్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2020 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. గరికపాటి మోహన్ రావు ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]గరికపాటి మోహన్ రావు 5 జనవరి 1948లో తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లో జన్మించాడు. ఆయన సి.కే.ఎం. కాలేజీ, వరంగల్ నుండి బిఎస్సి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గరికపాటి మోహన్ రావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2] గరికపాటి మోహన్ రావు 20 జూన్ 2019లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3][4][5] గరికపాటి మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా జనవరి 2022లో నియమితుడయ్యాడు.[6][7]
గరికపాటి మోహన్ రావుని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (8 October 2021). "బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి పెద్దపీట" (in ఇంగ్లీష్). Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (29 January 2014). "టీడీపీ అభ్యర్థులుగా గరికపాటి, తోట నామినేషన్లు". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ BBC News తెలుగు (20 June 2019). "బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల 'విలీనం'పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ Sakshi (18 August 2019). "కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ Sakshi (19 August 2019). "ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి". Sakshi. Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ Andhrajyothy (17 January 2022). "తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎస్టీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా గరికపాటి". Archived from the original on 17 జనవరి 2022. Retrieved 17 January 2022.
- ↑ Sakshi (17 January 2022). "తెలంగాణలో కమలం... కమిటీలు". Archived from the original on 18 జనవరి 2022. Retrieved 18 January 2022.
- ↑ Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.