Jump to content

గర్భిణీ హితచర్య

వికీపీడియా నుండి
గర్భిణీ హితచర్య
కృతికర్త: వావిలికొలను సుబ్బారావు
అంకితం: కోదండరామాలయం, ఒంటిమిట్ట
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: హితచర్యలు
ప్రక్రియ: గర్భవతి
ప్రచురణ: బ్రిటిష్ మాడల్ ముద్రాక్షరశాల, చెన్నపురి
విడుదల: 1919, 1924
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 142

ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు వాసుదాసుగారు. గ్రాంథికవాది. 1863లో జననం. 1939లో మరణం. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు. గర్భిణీల సంరక్షణ గురించి, వారు పాటించాల్సిన జాగ్రత్త గురించి ఈ గ్రంథం రచించారు.

దీని మొదటికూర్పు1919లో ముద్రించబడగా, రెండవకూర్పును మద్రాసులోని బ్రిటిష్ మాడల్ ముద్రాక్షరశాల యందు 1924 సంవత్సరంలో ముద్రించబడినది. ఇవి రెండునూ ఆర్యచరిత్రరత్నావళి ద్వారా ప్రచురింబడివి. కవి ఈ గ్రంథాన్ని ఒంటిమిట్టలోని కోదండరాముని కైంకర్యము చేయబడినది.

మూలాలు

[మార్చు]