Jump to content

గాండ్ల వెంకట్రావు

వికీపీడియా నుండి

గాండ్ల వెంకట్రావు ప్రజావైద్యుడు. అభ్యుదయ కళాసమితి అధ్యక్షుడిగా, పట్టణ కళాకారుల సమాఖ్య కన్వీనర్‌గా, ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ కోశాధికారిగా, పౌరహక్కుల సంఘం నాయకుడిగా పనిచేశారు.ఇద్దరు సంతానం.పాతికేళ్ల నుంచి డాక్టర్‌ గరికపాటి రాజారావు వర్ధంతిని ఒంగోలు లో క్రమం తప్పకుండా నిర్వహించిన గాండ్ల వెంకట్రావు స్వతహాగా నటుడు. 1960వ దశకంలో రక్తకన్నీరులోని నాగభూషణం పాత్రను ఏకపాత్రగా మార్చి 200 ప్రదర్శనలిచ్చారు. నవభారతం చిత్రంలో కూడా నటించిన గాండ్ల వెంకట్రావు వందేమాతరం, ఏవీఎస్‌, పోకూరి బాబూరావు, కాకరాల , మాదాల రంగారావులకు సన్నిహితుడు. దివిసీమ బాధితుల కోసంకళాప్రదర్శనలు ఇప్పించి విరాళాలు పంపారు. కళాక్షేత్రం ఈయన తీరని కోరిక.పేదప్రజలకు గౌతమీ వైద్యశాలలో ఉచిత వైద్యసేవలు అందించారు.డాక్టర్ గురుకుల మిత్రా శిష్యునిగా ఆక్యుపంక్చర్ వైద్యం కూడా చేశారు.డాక్టర్ సుంకు బలరాం గారి సహకారంతో ఉబ్బసవ్యాదికి చికిత్సలు అందించారు.గద్దలగుంట లోని తన నివాసంలో 18.6.2013 న కన్నుమూశారు.