గురుకుల మిత్రా
హేతువాది .1930 లో రేపల్లెలో జననం. సత్య శాయిబాబా ఆశ్రమంలో తాను పొందిన అనుభవాలతో ఆలోచించండి అనే పుస్తకాన్ని రాశారు. హైదరాబాదు హిమాయత్ నగర్లో ఆక్యుపంక్చర్ వైద్యం చేశారు. తెలుగుస్థాన్ పేరుతో తెలుగు వారికి ప్రత్యేక దేశం కావాలని పోరాడారు. 2007 లో చనిపోయారు.చనిపోయాక తనను అడ్డంగా కాక నిలువునా పాతి పెట్టాలని కోరాడు.తెలంగాణా నాస్తిక సంఘానికి వ్యవస్థాపక కార్యదర్శి. మిత్రా గారు దేవుళ్ళారామీపేరేమిటి? అనే హేతువాద గ్రంథం వ్రాశారు.అనేక నాటికలు, తెలుగుస్తాన్ అనే కవిత సంపుటిని, వ్రాసారు.ఈయన కమ్యూనిస్ట్ తత్వాన్ని, నాస్తికవాదాన్ని కలిపి "సమసంగం"అనే పార్టీ పెట్టారు.స్వతంత్ర తెలుగు రాజ్యం లక్ష్యంగా "ప్రజాధికారం" అనే మాస పత్రికను నడిపారు.ఈయనహేతువాద తత్వాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మగారు నీడతో యుద్ధం అనే పుస్తకం రాశారు."కులాల దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటాఉండాలని తొలిసారి ఆయనే చెప్పారు.బలహీన వర్గాల పార్టీని 80వ దశకంలోనే ప్రారంభించారు.తెలగ, కాపు, బలిజ, మున్నూరు కాపు, గాజుల బలిజ, తూర్పు కాపు, తదితరులంతా బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కోసం ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో తెలగ మహాసభ నిర్వహించారు.ఈ సభ హైదరాబాద్ కీస్ హై స్కూల్ లో జరిగింది.కొల్లా వెంకయ్య, కొండపల్లి సీతారామయ్య, కే జి సత్యమూర్తి (శివసాగర్ ) కత్తిపద్మారావు, ఓంకార్, కే జి కన్నబీరన్, భూపతి నారాయణమూర్తి, గద్దర్, కాళోజీ, మార్పు బాలక్రిష్ణమ్మ, నగ్నముని, జ్వాలాముఖి, తమిళనాడు నిడుమరాన్, దాసరి నారాయణరావు, పి కుమార్, కోవెన, అంబటి నరసింహారావు, సురమౌళి, అనిసెట్టి సాయి కుమార్, శ్రీకాంత్, ఏనుగు శివాజీ, చిత్తూరు సుదర్శన్, కటారి అప్పారావు, తోట త్రిమూర్తులు, పిళ్ళా వెంకటేశ్వరావు, మిరియాల వెంకట్రావు, తదితరులతో ఆయనకు సంబంధాలుండేవి.
విశేషాలు
[మార్చు]- "వ్యవస్థ అనకూడదు, వ్యవస్త అనాలంటాడు.పదిమంది అంటారు కానీ పదుగురు అంటారా అని ఎదురు ప్రశ్నించేవాడు.
- తన శవాన్ని అడ్డంగా కాకుండా నిలువుగా పాతిపెట్టమని కోరాడు