నీడతో యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీడతో యుద్ధం పుస్తకం రంగనాయకమ్మ కొందరు బూర్జువా నాస్తికులకి వ్యతిరేకంగా వ్రాసిన వ్యాసాల సంకలనం.

నాస్తిక యుగం, చార్వాక పత్రికల పై విమర్శలు

[మార్చు]

జనం దేవుళ్ళని, దెయ్యాలని నుమ్ముకునేంత అమాయకులుగా ఉంటేనే పాలక వర్గం వాళ్ళకి లాభం. మెజారిటీ జనంలో చైతన్యం పెరగడం పాలక వర్గానికి ఇష్టం ఉండదు. నాస్తిక యుగం, చార్వాక పత్రికల వారు కూడా మూఢ నమ్మకాల విషయంలో పాలక వర్గం వారిని విమర్శించారు కానీ ఆ పత్రికల వారే ప్రభుత్వానికి తమ ఉద్యమానికి సహకరించమని కోరుతూ ఉత్తరాలు ప్రచురిస్తుంటారు.[1] వీరికి వర్గ స్వభావం తెలియదని రంగనాయకమ్మ విమర్శ.

భారత నవ్యమానవవాద సంఘం పై విమర్శలు

[మార్చు]

కుల వ్యవస్థ వల్ల, మత కట్టుబాట్ల వల్ల విసుగు చెందిన కొంత మంది నాస్తిక, హేతువాద, మానవవాద ఉద్యమాలకి ఆకర్షితులవుతారు. ఈ ఉద్యమాల వల్ల తాత్కాలిక ప్రభావమే ఉంటుంది తప్ప శాశ్వత ప్రయోజనం ఉండదని రంగనాయకమ్మ వాదన. డబ్బున్న వాళ్ళు - పేదవాళ్ళు అన్న భేదాలు కుల మత కట్టుబాట్లకి సంబంధం లేకుండా కూడా కొనసాగుతాయి. ఒక దళిత పేదవాడు నాస్తికునిగా మారి తన కుల ఐడెంటిటీని వదులుకున్నా అతని ఆర్థిక హోదా కారణంగా అతన్ని తక్కువ స్థాయి వ్యక్తిగా చూడడం జరుగుతంది. డబ్బున్న వాళ్ళు - పేదవాళ్ళు అన్న భేదాల గురించి అర్థం చేసుకోకుండా కులాన్ని, మతాన్ని ఎంత విమర్శించినా పేద వాళ్ళకి ప్రయోజనం ఉండదు. భారత నవ్యమానవవాద సంఘం స్థాపకుడైన ఎమ్.వి. రామమూర్తి వ్యాసాలని విమర్శిస్తూ రంగనాయకమ్మ పై విషయాలని ఉదహరించారు.

శ్రీశ్రీ,, జ్వాలాముఖి, సి.వి.ల పై విమర్శలు

[మార్చు]

శ్రీశ్రీ, జ్వాలాముఖి, సి.వి.ల వాదన ప్రకారం నాస్తికత్వం వల్ల మనిషికి పరిపూర్ణ చైతన్యం కలుగుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నాస్తికత్వం సరిపోదని రంగనాయకమ్మ వాదన. దేవుడు, దెయ్యాలు లేవని కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. ఆ జ్ఞానం కలిగినంత మాత్రాన పెట్టుబడిదారునికి లాభాలు ఎలా వస్తాయియి, అదనపు విలువ అంటే ఏమిటి లాంటి అంశాల పైన అభిప్రాయాలు మారకపోవచ్చు. శ్రీశ్రీ, జ్వాలాముఖి, సి.వి.ల వాదన అన్ని సమస్యలకి ఒకటే మూలం, అన్ని రోగాలకి ఒకటే మందు అని భ్రమపడే వారి వాదన లాగ ఉందని రంగనాయకమ్మ విమర్శ.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]