గాడు చిన్ని కుమారి లక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాడు చిన్ని కుమారి లక్ష్మి తెలుగుదేశం నాయకురాలు, భీమిలి మున్సిపాలిటీ తుది చైర్మెన్ & గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ టిడిపి డిప్యూటి ఫ్లోర్ లీడర్

గాడు చిన్ని కుమారి లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్, టిడిపి డిప్యూటి ఫ్లోర్ లీడర్. భీమిలి మున్సిపాలిటీ తుది చైర్మెన్ గా విధులు నిర్వర్తించారు.[1] ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరుపున ఉమ్మడి (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) పట్టభద్రుల ఎం.ఎల్.సి. అభ్యర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించింది[2]. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మార్చేని ఆమె స్థానంలో చిరంజీవిరావును రంగంలోకి దించాడు[3]. ఈమె భర్త, గాడు అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

గాడు చిన్ని కుమారి లక్ష్మి 1974 మే 17 న విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం విలాస్ ఖాన్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లితండ్రులు బోని నారాయణమ్మ  బోని సన్యాసి నాయుడు. భర్త గాడు అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వ్యాపారవేత్త. ప్రస్తుతం భీమిలిలో నివాసముంటున్నారు. చిన్ని కుమారి లక్ష్మి ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి బి.ఇ.డి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందిన పట్టభద్రురాలు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన మున్సిపాల్టీగా గుర్తింపు వున్నా భీమునిపట్నం (భీమిలి) మున్సిపాల్టీకి తుది ఛైర్మన్ గా పనిచేసారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో చిన్ని కుమారి లక్ష్మి

[మార్చు]

2022 అక్టోబరు మొదటివారంలో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి లక్ష్మి పేరును అధిష్టానం ఖరారు చేసింది. చిన్ని కుమారిని ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆ ప్రకటనలో అచ్చెన్నాయుడు ఈ విధంగా పేర్కొన్నారు :

భీమిలి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్, జీవీఎంసీ రెండో డివిజన్ కార్పొరేటర్ అయిన గాడు చిన్ని కుమారి లక్ష్మి కుటుంబం చాన్నాళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉంది. ఆమె భర్త రెవెన్యూ ఉద్యోగిగా చేసి వలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. బీసీ మహిళకి ఈ సారి అవకాశం ఇద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు భావించడంతో ఆమె పేరును ఖరారు చేయడం జరిగింది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలుత నలుగురి పేర్లతో కూడిన జాబితా అధిష్టానానికి పంపించగా ఆ పేర్లలో ఒకరు చిన్ని కుమారి. అంగబలం, అర్థబలం, పార్టీకి విధేయత, చదువు లాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఆఖరికి ఆమె పేరును నిర్ణయించారు.

మూలాలు

[మార్చు]
  1. "ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ". ap7am.com. 2022-10-07. Retrieved 2024-10-12.
  2. "TDP ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన.. మహిళకు అవకాశం". Samayam Telugu. Retrieved 2024-10-12.
  3. "ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చేసిన టీడీపీ.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?". Samayam Telugu. Retrieved 2024-10-12.
# తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తో గాడు చిన్ని కుమారి లక్ష్మి, గాడు అప్పలనాయుడు