గానవి లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గానవి లక్ష్మణ్
జననం1992 జులై 04
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుగనవి, గను, గన్వీ, గణని, జానకి
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2021–ప్రస్తుతం

గానవి లక్ష్మణ్‌ (జననం 1992 జూలై 04) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె ప్రధానంగా కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది. మగలు జానకి అనే టెలి సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపుతెచ్చుకుంది. హీరో (2021) చిత్రంలో రిషబ్ శెట్టి సరసన నటించి గానవి లక్ష్మణ్ శాండల్‌వుడ్‌లో ప్రధాన నటిగా అరంగేట్రం చేసింది. 2022లో గాయకుడు రసమయి బాలకిషన్‌ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం రుద్రంగిలో గానవి లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో ఒక పాత్ర పోషిస్తోంది.[1] అలాగే శివ రాజ్‌కుమార్తో వేద, రిషబ్ శెట్టితో నాథూరామ్ సినిమాల్లో సరసన నటిస్తోంది.

కెరీర్[మార్చు]

గానవి లక్ష్మణ్‌ను గానవి, గన్వీ, జానకి అని కూడా పిలుస్తారు. ఆమె కర్ణాటకలోని చిక్కమగళూరులో 1992 జూలై 4న జన్మించింది. ఆమె ఉడిపిలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. థియేటర్‌ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి టీవీ సీరియల్, ఆ తరువాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సీరియల్ మగలు జానకిలో జానకి పాత్ర పోషించి కర్ణాటకలో ప్రాచుర్యం పొందింది. ఎంతవరకంటే ఏకంగా తన పేరే జానకిగా మారిపోయంత.

మూలాలు[మార్చు]

  1. "'రుద్రంగి' నాదే." web.archive.org. 2022-11-23. Archived from the original on 2022-11-23. Retrieved 2022-11-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)