గాయత్రి (సామాజిక సేవకురాలు)
గాయత్రి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త |
గాయత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]గాయత్రి వనపర్తి లో జన్మించింది. పదో తరగతి వరకు హైదరాబాద్ మలక్‌పేట్ లోని అంధుల పాఠశాలలో చదివింది. ఇంటర్ పటాన్ చెరువు లో చదివిన గాయత్రి, డిగ్రీ వనపర్తి లోని ఆర్.ఎల్.డీ. కళాశాలలో పూర్తిచేసింది. నాంపల్లి లోని ఆంధ్ర మహిళా సభలో పీజీ, బీఈడీ చదివింది.
ఉద్యోగం
[మార్చు]2000 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన గాయత్రి, ఏడేళ్ల అనంతరం జీ.హెచ్.ఎం.గా పదోన్నతి పొంది కొత్తకోట లో విధులు నిర్వహించింది. ప్రస్తుతం వనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో జీ.హెచ్.ఎం. గా పనిచేస్తుంది.
సేవారంగం
[మార్చు]అంధురాలైన గాయత్రి తన ప్రతిభాపాటవాలతో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ, తను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధి కోసం దాతల సహకారాన్ని తీసుకుంటూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతుంది. మహిళలను ప్రోత్సహించడం వారిలో ఉన్న అనేక ప్రతిభా పాటవాలను వెలికితీయడంలో కృషి చేస్తుంది.
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 14 April 2017.