Jump to content

గాడిద

వికీపీడియా నుండి
(గార్ధభము నుండి దారిమార్పు చెందింది)

గాడిద
Domesticated
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Subgenus:
ఎసినస్
Species:
ఈ. ఎసినస్
Binomial name
ఈక్వస్ ఎసినస్

గాడిద లేదా గాడిదె (ఆంగ్లం: Donkey / ass) ఒక గుర్రం లాంటి జంతువు. ఇవి ఈక్విడే లేదా గుర్రం కుటుంబానికి చెందినవి. ఇవి పెరిసోడాక్టిలా క్రమానికి చెందిన ఖురిత జంతువులు. గాడిదలు ఆఫ్రికా అడవి గాడిదల నుండి పరిణామం చెందాయని భావిస్తారు. సంస్కృతంలో దీని పేరు గార్ధభము.

దీనిని ఎక్కువగా బరువులు మోసేందుకు వినియోగిస్తారు. మరొకరిని తిట్టేందుకు కూడా అధికంగా వాడుతారు.

చరిత్ర

[మార్చు]
గాడిద
Classic British seaside donkeys in Skegness
A 3-week-old donkey

ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన జంతువులు జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.

గాడిదలు మొదటిసారిగా సుమారు 3000 BCE నుండి మానవులు పెంచుకుంటున్నారు.[1] ఇంచుమించు గుర్రాలను ఇదే కాలం నుండి పెంపకం మొదలైనది. తరువాత ఇవి రెండు ప్రపంచమంతా వ్యాపించాయి. పెంచుకొనే గాడిదలు విస్తరించగా, అడవి గాడిదలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఇవి తమ ఆత్మరక్షణ కోసం ఎక్కువగా వెనుక కాళ్ళను వాడతాయి. వాటితో తంతే కొన్ని సార్లు బలమైన గాయాలు కూడా తగులుతాయి. మూతి పల్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • గ్రామీణ ప్రాంతాలలో అధిక బరువులు మోయడానికి చాకలి వారు ఎక్కువగా గాడిదలను ఉపయోగిస్తారు.
  • గాడిద పాలను కొన్ని ఆయుర్వేద మందులలో వాడుతారు.

వివిద దేశాలలో గాడిదల వినియోగం

[మార్చు]

ఇతర దేశాలలో గాడిద పాల నుండి తీసిన వెన్న ఒక కిలో ధర $1800 పలుకుతుంది, మన భారతీయ రూపాయలలో కనీసం రు.80,000 పలుకుతుంది, భారతీయ రైతులు దీని మీద ద్రష్టి పెడితే మంచి లాభాలు వస్తాయి .

గుర్రంలా గాడిద పరుగెత్తకపోవుటకు కారణము

[మార్చు]

వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.

గాడిదలపై తెలుగులో గల సామెతలు

[మార్చు]
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట.
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట.
  • గాడిద గుడ్డు కాదూ..!

మూలాలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. Rossel S, Marshall F et al. "Domestication of the donkey: Timing, processes, and indicators." PNAS 105(10):3715-3720. March 11, 2008. Abstract Archived 2008-06-07 at the Wayback Machine

వెలుపలి లంకెలు

[మార్చు]
  • Blench, R. 2000. The History and Spread of Donkeys in Africa. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA)
  • Clutton-Brook, J. 1999. A Natural History of Domesticated Mammals. Cambridge, UK: Cambridge University Press. ISBN 0-521-63495-4
  • The Donkey Sanctuary (DS). 2006. Website. [1] (accessed December 2, 2006).
  • Huffman, B. 2006. The Ultimate Ungulate Page: Equus asinus. (accessed December 2, 2006).
  • International Museum of the Horse (IMH). 1998. Donkey. (accessed December 3, 2006).
  • Nowak, R. M., and J. L. Paradiso. 1983. Walker's Mammals of the World. Baltimore, Maryland, USA : The Johns Hopkins University Press. ISBN 0-8018-2525-3
  • Oklahoma State University (OSU). 2006. Breeds of Livestock. (accessed December 3, 2006).
  • Starkey, P. and M. Starkey. 1997. Regional and World trends in Donkey Populations. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA) [2][permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=గాడిద&oldid=3557337" నుండి వెలికితీశారు