Jump to content

గిబ్బన్

వికీపీడియా నుండి
(గిబ్బన్లు నుండి దారిమార్పు చెందింది)

గిబ్బన్లు[1][2]
Temporal range: Miocene–Recent
Lar Gibbon (Hylobates lar)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
హైలోబాటిడే

ప్రజాతులు

హైలోబాట్స్
హూలక్
నొమాస్కస్
సింఫాలాంగస్

గిబ్బన్లు (ఆంగ్లం Gibbons) హైలోబాటిడే కుటుంబానికి చెందిన చిన్న ఏప్స్. ఇందులో డిప్లాయిడ్ క్రోమోజోమ్ సంఖ్య ఆధారంగా నాలుగు ప్రజాతులు ఉన్నాయి: హైలోబాట్స్ (44), హూలక్ (38), నొమాస్కస్ (52), సింఫాలాంగస్ (50).[2][3] గిబ్బన్లు ఉష్ణ మండల ప్రాంతాలలో భారతదేశం నుండి ఇండోనేషియా వరకు చైనా నుండి సుమత్రా, బోర్నియో, జావా దీవులలో వ్యాపించి ఉన్నాయి.

గిబ్బన్లను 'చిన్న ఏప్స్' అని కూడా అంటారు. ఇవి పెద్ద ఏప్స్ (చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, మనుషులు) తో విభేధిస్తాయి. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, జతలుగా తిరుగుతాయి, ఇల్లు కట్టుకోవు. వీటి శరీర నిర్మాణం కొంతవరకు కోతులకు దగ్గరగా ఉంటుంది. గిబ్బన్లు ప్రధానంగా బలమైన పొడుగైన చేతులతో ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు ఊగుతూ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అంతేకాకుండా చేతులు పైకెత్తి రెండు కాళ్ళమీద నడవగలుగుతాయి. చెట్లమీద నివసించే ఎగరలేని క్షీరదాలన్నింటి కంటే ఇవి వేగంగా ప్రయాణించగలవు.[4] ప్రజాతి, లైంగిక స్థితిని బట్టి వీటి తోలు లేత గోధుమ రంగు నుండి నలుపు రంగు మధ్యలో ఉంటాయి.

వర్గీకరణ

[మార్చు]
Hominoid family tree

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. pp. 178–181. OCLC 62265494. ISBN 0-801-88221-4.
  2. 2.0 2.1 Mootnick, A.; Groves, C. P. (2005). "A new generic name for the hoolock gibbon (Hylobatidae)". International Journal of Primatology. 26 (26): 971–976. doi:10.1007/s10764-005-5332-4.
  3. 3.0 3.1 Geissmann, Thomas (December 1995). "Gibbon systematics and species identification" (PDF). International Zoo News. 42: 467–501. Retrieved 2008-08-15.
  4. David Attenborough, Life of Mammals, Episode 8: Life in the Trees. BBC Warner, 2003.
"https://te.wikipedia.org/w/index.php?title=గిబ్బన్&oldid=4302918" నుండి వెలికితీశారు