గిరిపురం (నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిపురం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522268
ఎస్.టి.డి కోడ్ 08648

గిరిపురం గుంటూరు జిల్లా, నగరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 268., ఎస్.టి.డి. కోడ్ = 08648.

గ్రామ పంచాయతీ[మార్చు]

గిరిపురం గ్రామం, నగరం గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలోని ఈ ఆలయంలో, స్వామివారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, మే నెల 6 నుండి 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 9వ తేదీ శుక్రవారం నాడు, స్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించారు. 10వ తేదీ శనివారం నాడు, ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామివారి వ్రతాలు జరిగినవి. ఈ వ్రతాలలో వందలాదిమంది దంపతులు కూర్చున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమాలలో ఈదుపల్లి, ముత్తుపల్లి, నగరం, కారంకివారిపాలెం, పూడివాడ, గాలివారిపాలెం, బెల్లంవారిపాలెం, యేలేటిపాలెం మొదలగు గ్రామాల ప్రజలు విశేషసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-2వతేదీ, శ్రావణ శనివారం నాడు, శాంతికళ్యాణం నిర్వహించారు. వాతావరణం అనుకూలించి, వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా శాంతి సౌభాగ్యాలు, సిరిసంపదలతో చల్లగా వర్ధిల్లాలని, దంపతులతో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేసారు. [1] & [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి,అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు