గీతాంజలి శ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతాంజలి శ్రీ
2010లో గీతాంజలి శ్రీ
పుట్టిన తేదీ, స్థలంగీతాంజలి పాండే
(1957-06-12) 1957 జూన్ 12 (వయసు 67)
మైన్‌పురి
భాషహిందీ
జాతీయతభారతీయురాలు
రచనా రంగంనవలలు,లఘుకథా రచయిత్రి short stories
గుర్తింపునిచ్చిన రచనలుటాంబ్ ఆఫ్ సేండ్
పురస్కారాలుఅంతర్జాతీయ బుకర్ బహుమతి(2022)

గీతాంజలి శ్రీ (జ. 1957 జూన్ 12) [1] గీతాంజలి పాండేగా సుపరిచితురాలు.[a]. ఆమె న్యూఢిల్లీకి చెందిన హిందీ నవలా రచయిత్రి, లఘు కథా రచయిత్రి. ఆమె అనేక చిన్న కథలు, ఐదు నవలలు రాసింది. ఆమె 2000లో రాసిన నవల "మై" 2001లో క్రాస్ బుక్ పురస్కార జాబితాలో స్థానం పొందింది.[3] ఈ నవల ఆంగ్ల అనువాదాన్ని 2017లో నీతా కుమార్ చేయగా అది 2017లో "నియోగి" పుస్తకంలో ప్రచురితమైంది. 2018 లో ఆమె రాసిన నవల "రెట్ సమాధి" 2022 లోనికి "టాంబ్ ఆఫ్ సాండ్"గా డైసీ రాక్ వెల్ అనువదించాడు. ఆ పుస్తకం అంతర్జాతీయ బుకర్ పురస్కారాన్ని పొందింది.[4] కాల్పనిక నవలనే కాకుండా ఆమె ప్రేమ్‌చంద్ నవలలపై విమర్శనాత్మక రచనలు కూడా చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గీతాంజలి ఉత్తర ప్రదేశ్ లోని మైన్‌పురి పట్టణంలో జన్మించింది.[5] ఆమె తండ్రి అనిరుధ్ పాండే ప్రభుత్వోద్యోగి కావడంతో ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని వివిధ పట్టణాల్లో నివసించింది. అలహాబాద్ డీఎంగా అనిరుధ్ పాండే పనిచేసాడు. అప్పట్లో ఆంగ్లంలో బాలల పుస్తకాలు లేకపోవడంతో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఆమె పెరగడం తనకు హిందీతో గొప్ప అనుబంధాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొంది.[2] ఆమె పూర్వీకులు ఘాజీపూర్ జిల్లా, గొండూర్ గ్రామానికి చెందినవారు.[6]

విశ్వవిద్యాలయంలో, ఆమె చరిత్ర అధ్యయనం చేసింది. ఆమె లేడీ శ్రీ రామ్ కాలేజీలో బి.ఏ పూర్తి చేసింది.[7] ఆమె జేఎన్‌యూ నుంచి మాస్టర్స్ చేసింది.[8] రచయిత ప్రేమ్‌చంద్‌పై బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో తన పి.హెచ్.డిని ప్రారంభించిన తర్వాత, ఆమె హిందీ సాహిత్యంపై మరింత ఆసక్తిని కనబరిచింది.[9] ఆమె తన పీహెచ్‌డీ సమయంలో తన మొదటి చిన్న కథను వ్రాసింది.[10] గ్రాడ్యుయేషన్ తర్వాత రచనా ప్రస్థానాన్ని ప్రారంభించింది.[9]

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]

గీతాంజలి శ్రీ "ఇందు శర్మ కథ సమ్మాన్" పురస్కార గ్రహీత.[11] ఆమె భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జపాన్ ఫౌడేషన్ యొక్క ఫెలోషిప్ పొందింది. ఆమె రంగస్థలంపై కూడా పాల్గొంటుంది. రచయితలు, కళాకారులు, నృత్యకారులు, చిత్రకారులతో కూడిన థియేటర్ గ్రూప్ అయిన వివాడితో కలిసి పనిచేస్తుంది.[2]

2022లో ఆమె రాసిన టోంబ్ ఆఫ్ సాండ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన మొదటి హిందీ భాషా నవలగా నిలిచింది[12][13]. ఆమె తర్వాత బహుమతిని గెలుచుకుంది.[14][15]

వివరణాత్మక నోట్సు

[మార్చు]
  1. Her birth name is Geetanjali Pandey, but she took her mother's first name Shree as her last name.[2]

మూలాలు

[మార్చు]
  1. Chhaya, Mayank (27 May 2022). "Geetanjali Shree first Indian to win International Booker Prize: Will it open doors for translations of great literature in all Indian languages?". South Asian Monitor. Retrieved 29 May 2022.
  2. 2.0 2.1 2.2 'I'm Waiting To Write The Book Which Will Slip Out Of My Grasp' Interview with Geetanjali Shree in Outlook India
  3. Bent Over Backwards excerpts from Mai - Outlook India.
  4. "Tomb of Sand | The Booker Prizes". thebookerprizes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
  5. "Geetanjali Shree is first Indian winner of International Booker Prize". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-05-27. Retrieved 2022-05-28.
  6. "Booker Prize: गीतांजलि श्री को बुकर पुरस्कार मिलने से गाजीपुर गौरवान्वित, जिले में खुशी का माहौल" [Ghazipur proud of Gitanjali Shree receiving Booker Prize, atmosphere of happiness in district]. Amar Ujala (in హిందీ). Retrieved 2022-05-28.
  7. "Geetanjali Shree got her PhD degree from MSU". Times of India. 28 May 2022. Retrieved 29 May 2022.
  8. "JNU congratulates alumna Geetanjali Shree on International Booker win". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
  9. 9.0 9.1 "Geetanjali Shree's 'Tomb of Sand' makes it to Booker longlist". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-03-26. Retrieved 2022-05-28.
  10. "Geetanjali Shree". Kalam (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-07. Archived from the original on 2023-02-06. Retrieved 2022-05-28.
  11. The past is ever present, realized by us in bits: An interview with Geetanjali Shree Deep Blue Ink
  12. Marshall, Alex (7 April 2022). "Women Dominate Shortlist for International Booker Prize". The New York Times. Retrieved 8 April 2022.
  13. "Geetanjali Shree's 'Tomb of Sand' first Hindi novel on International Booker shortlist". The Indian Express (in ఇంగ్లీష్). 7 April 2022. Retrieved 8 April 2022.
  14. "First novel translated from Hindi wins International Booker prize". The Guardian (in ఇంగ్లీష్). 2022-05-26. Retrieved 2022-05-26.
  15. "Geetanjali Shree and Daisy Rockwell win 2022 International Booker Prize". The Irish Times (in ఇంగ్లీష్). Retrieved 2022-05-26.