గీతా వరదన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గీతా వరదన్ భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఈమె ప్రస్తుతం ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ గా పనిచేస్తున్నారు.

గీతా వరదన్

జీవిత విశేషాలు[మార్చు]

డాక్టర్ గీతా వరదన్ ఐ.సి.ఎస్.సి (బెంగళూరు) కి చెందిన స్కూల్ ఆఫ్ ఆటోమేషన్ నుంచి ఎం.ఇ పట్టాను పొందారు. 1979 లో "ఇస్రో"లో చేరారు. అప్పటికే డి.ఆర్.డి.ఓకి చెందిన రెండు పరిశోధనాశాలల్లో పనిచేసి, హార్డ్ వేర్ డెవలప్‌మెంటు రంగంలో విశేష కృషి చేశారు. తదనంతరం రిమోట్ సెన్సింగ్ రంగంలోకి ప్రవేశించారు.

డాక్టర్ గీత గారు 2008 లో ప్రారంభించిన "కార్టోశాట్ 2 ఏ"కు ప్రాజెక్టు డైరక్టరుగా నియమితులైనారు. 2004 లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి "బెస్ట్ సైంటిస్టు" అవార్డు అందుకున్న తొలి గ్రహీతగా ప్రఖ్యాతులయ్యారు. ఈమె 2008 మే నెలలో "ఇస్రో" సంస్థలలో ఒక దానికి తొలి మహిళా డైరక్టరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.స్థాపితమైన తొమ్మిది రీజినల్ రిమోట్ సెన్సింగ్ సర్వీసింగ్ సెంటర్స్ లో ఒకదానికి (అడ్వాన్స్‌డ్ డాటా ప్రాసెసింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, హైదరాబాదు) డైరక్టరుగా నియమితులైనారు.

అవార్డులు[మార్చు]

ఈమె "ఇస్రో"లో అడాన్స్‌డ్ డాటా రీసెర్చి ఇనిస్టీట్యూట్ డైరక్టరుగా ఉన్న తొలి మహిళా శాస్త్రవేత్త. ఈమె 2009, సెప్టెంబరు 1 వ తేదీన "ఇస్రో మెరిట్ అవార్డు - 2008"ను భారత ప్రధాని నుండి న్యూఢిల్లీలో అందుకున్నారు. ఈమెను 2014 సంవత్సరానికి గానూ నాయుడమ్మ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు. నాయుడమ్మ స్వస్థలమైన తెనాలిలో 2015 మార్చి 1వ తేదీ సాయంత్రం నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో అవార్డు ప్రదానోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా టెస్సీథామస్ ‘రక్షణరంగ అవసరాలు-చొరవ-భారత్ సంసిద్ధత’ అంశంపైనా, గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు.[1][2]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

  1. సాక్షి పత్రికలో ఆర్టికల్
  2. హిందూ పత్రికలోని ఆర్టికల్