గుండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండు అనే పదమును వేరు వేరు సందర్భారలలో వేరు వేరు అర్థాలకు ఉపయోగిస్తారు. మానవులు తమ శిరస్సుపై గల వెంట్రుకలను తొలగించుకోవడాన్ని గుండు చేయించుకోవడము గా వ్యవహరిస్తారు. అలాగే గుండ్రము అనే పదానికి ప్రత్యుమ్నాయంగా గుండును వాడుతారు. అలాగే పెద్ద పెద్ద బండరాళ్ళను సంబోధించడానికి కూడా దీనిని వాడుతారు.కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో, ప్రత్యేకించి ఉయ్యాలవాడ ప్రాంతంలో మొత్తం అనే పదానికి గుండు మొత్తం అనే పదాన్ని వాడతారు. తెలుగు భాషలో గుండు పై కొన్ని సామెతలు కూడా ఉన్నాయి.


గుండు [ guṇḍu ] gunḍu. [Tel.] n. A round stone. A cannon ball or bullet. ఫిరంగిగుండు. A lump. A weight (or stone) for scales. A hill పర్వతము. గుండుగుర్రము a stallion or stone horse. వెండిగుండు name of a kind of dog. భైరవుడు, "కత్తెరసంపంగి, వెండిగుండు" Manu. iv. 42. A polishing stone used by masons in plastering. కసిలెగుండు the iron hoop that forms the lip of a leathern bucket. adj. Round, globular, spherical. గుండుకొట్టు gunḍu-koṭṭu. n. To smoke the drug called bhang. గుండుకోవి> gunḍu-kōvi. n. A small cannon, a swivel. పెట్లదిమ్మ. See గుండుగిలు gunḍu-gilu. v. n. To move in a circle. చుట్టుపడు. గుండుగుత్త gunḍu-gutta. n. An all-round settlement, i.e., a lease which covers all rights and privileges. సమస్త స్వాతంత్య్రముతో ఇచ్చే గుత్త, బిల్మక్తా. గుండుకొను or గుండుగూడుకొను gunḍu-konu. v. n. To unite, to make one common effort. To surround చుట్టుకొను. "అప్పుడందరును హాహాకారంబులన్ గుండుగూడుకొని సవరింపంగ." G. ix. 65. గుండుములుగాడు gunḍu-mulupu-gāḍu. The Nightjar or the goatsucker, గుండువేయు gunḍu-vēyu. v. n. To fire a gun: to die. గుండు వేసి కాల్చు to fire a ball at. గుండుసూది gunḍu-sūdi. n. A pin. గుండ్రాయి gunḍ-rāyi. n. A round stone or stone pestle. గుండ్లదండ or గుండ్లపేరు gunḍla-danḍa. n. A necklace of beads.


గుండు కొందరి ఇంటి పేరు.

"https://te.wikipedia.org/w/index.php?title=గుండు&oldid=1177504" నుండి వెలికితీశారు