గుడిహాళం రఘునాథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిహాళం రఘునాథం

గుడిహాళం రఘునాథం ప్రముఖ తెలుగు కథా రచయితలు. 'పర్సన్ సింగ్‌లర్’-అని గుడిహాళం మొదటి కవితా సంపుటి. ఆ తరువాత ‘ఒక జననం - ఒక మరణం’ అన్న పేరుతో సంకలనం వెలువరించాడు. ప్రాచీన కవిత్వాన్నీ, ఇంగ్లీషు కవిత్వాన్నీ కూడా బాగా చదివాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తి చేశారు. ఆయన మెదక్ జిల్లా సదాశివపేట కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా అమరచింతలో జన్మించారు. తెలుగు కవిత్వంలో తనదంటూ ఓ ముద్రను వేసుకున్నారాయన. తన తొలి కవితా సంపుటి ఫోర్త్ పర్సన్ సింగ్యులర్ తోనే తెలుగు కవితా ప్రపంచంలో తనదైన విశిష్టతను చాటి చెప్పారు. ఆ తర్వాత "ఒక జననం - ఒక మరణం" అనే కవితా సంపుటిని వెలువరించారు. తెలుగు సమాజంలో మార్పును, సాహిత్యంలో కొత్త విలువలను ఆశిస్తూ ఏర్పడిన విపశ్యన కవుల్లో ఆయన ఒకరు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఏసుపాదం, శివకుమార్, కె. శ్రీనివాస్ లతో కలిసి ఆయన నల్లవలస దీర్ఘ కవిత రాశారు. తెలంగాణ కోణం నుంచి వెలువడిన దీర్ఘ కవిత అది.[2]

"ఒక జననం, ఒక మరణం" కావ్యాన్ని ఎదలోతుల్ని తడుముతున్నందుకు ఎంకన్నకు అంకితమిచ్చాడు రఘునాథం. పాలమూరు జిల్లా పండితపరంపర కోవను ప్రక్షాళన చేసి జనతాత్విక కవిత్వస్రవంతిలో సంగమింపజేసిన సందర్భం అది.[3] "ఒక జననం - ఒక మరణం" కావ్యానికిగానూ ఆయనకు 2007లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.

మరణం

[మార్చు]

ఆయన హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన డిసెంబరు 27, 2010 న మరణించారు. ఆయన కాలేయ సంబంధమైన వ్యాధితో బాధపడ్డారు. ఆయన వయస్సు దాదాపు 55 ఏళ్లు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]