గురుత్వ ద్రవ్యరాశి
గురుత్వ ద్రవ్యరాశి
[మార్చు]ఒక వస్తువు ద్రవ్యరాశి త్రాసులోతూచి కనుక్కోవచ్చు.త్రాసులోని రెండు పళ్లాలలోని రెండు సమాన ద్రవ్యరాసులు ఉండే వస్తువులను పెట్టి తూస్తాం. అప్పుడు రెండువస్తువుల ద్రవ్యరాసులు సమానం అంటాం. అయితే మనం తూచింది రెండు వస్తువుల భారాన్ని-అంటే, ఆ వస్తువులపై భూమి గురుత్వాకర్షణ బలాన్ని తూచాం. ఇలా భారం మీద ఆధారపడి కొలిచిన ద్రవ్యరాశిని "గురుత్వద్రవ్యరాశి" అంటారు.
గురుత్వద్రవ్యరాశిని కొలిచేటప్పుడు వస్తువు త్రాసులో నిశ్చలస్థితిలో ఉంటుంది. బలప్రయోగంచేత గమనంలో ఉండదు. జడత్వద్రవ్యరాశిని కొలిచేటప్పుడు వస్తువు గమనంలో ఉంటుంది.ఈ గమనంలోని త్వరణాన్ని ప్రయోగించిన బలమొక్కటే కలిగిస్తుందా లేదా ఏవైనా తెలియని బలాలతో(ఘర్షణ, విద్యుశ్చలనం లాంటివి) కూడా కలిగిస్తుందా? అనే అనుమానంరావచ్చు.అంచేత జడత్వద్రవ్యరాశి కొలవడం కష్టం. అన్ని విధాలా జడత్వ ద్రవ్యరాశీకీ, గురుత్వద్రవ్యరాశికీ తుల్యత ఉంది. (1)రెండు ద్రవ్యరాశులు వస్తువులోని పధార్ధంపై ఆధారపడినవే.
(2)కొన్ని వస్తువుల ద్రవ్యరాశుల మొత్తం కనుక్కొనేందుకు వాటి ప్రత్యేక ద్రవ్యరాసులను కూడుతాము.మనం తీసుక్కొన్నది జడత్వద్రవ్యరాశిలకాని,గురుత్వద్రవ్యరాశికాని వాటిని కూడవచ్చు.
(3)రసాయనిక ప్రక్రియలో లెక్కించడానికి, వస్తువుల ద్రవ్యరాశులు తీసుకోవాల్సి ఉంటుంది.అప్పుడు జడత్వద్రవ్యరాశినో లేక గురుత్వద్రవ్యరాసినో ఏదైనా తీసుకోవచ్చు.ఈ విధంగా అన్నిటిలోనూ రెండు విధాలైన ద్రవ్యరాశులకూ తుల్యత ఉంది.కష్టసాధ్యమైన జడత్వద్రవ్యరాశిక బదులు గురుత్వద్రవ్యరాశినే తీసుకోవచ్చు.దీనినే "ద్రవ్యరాశి" అనవచ్చు.
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకం.
బయట లింకులు
[మార్చు]- ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకం.