గురుదాస్ మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుదాస్ మాన్
జననం

(1957 -01-04) 1957

జనవరి 4 (వయస్సు: 61  సంవత్సరాలు)
గిద్దర్బాహా, శ్రీ ముక్తిసర్ జిల్లా, పంజాబ్, భారత్
రంగం పంజాబ్ జానపద సంగీతం
భాంగ్రా
వృత్తి గాయకుడు
నటుడు
క్రియాశీల కాలం 1980–ప్రస్తుతం
వెబ్‌సైటు http://www.gurdasmaan.com, http://www.YouTube.com/GurdasMaan

గురుదాస్ మాన్ పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు. పంజాబీ సంగీత ప్రముఖుల్లో ఒకడు. [1] అతను పంజాబ్ రాష్ట్రంలోని గిద్దర్బాబా అనే గ్రామంలో జన్మించాడు. 1980 లో దిల్ దా మామ్లా హై అనే పాటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుండి 34 ఆల్బములు, 305 కి పైగా పాటలు సృష్టించాడు. 2013 లో యూట్యూబులో అభిమానుల కోసం ఓ ఛానల్ ప్రారంభించాడు.

2009 లో బూట్ పాలిషన్ అనే ఆల్బమ్ కి గాను యూకే ఆసియన్ మ్యూజిక్ అవార్డ్స్ నుంచి బెస్ట్ ఇంటర్నేషనల్ ఆల్బమ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గురుదాస్ మాన్ సర్దార్ గురుదేవ్ సింగ్, బీబీ తేజ్ కౌర్ అనే సిక్కు దంపతులకు జన్మించాడు. మంజీత్ మాన్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి గురిక్ జి. మాన్ అనే కొడుకు ఉన్నాడు.[3]

కెరీర్[మార్చు]

గురుదాస్ మాన్ దిల్ దా మామ్లా హై అనే పాటతో వెలుగులోకి వచ్చాడు. తరువాత మామ్లా గడబిడ్ హై, ఛల్లా అనే పాటలు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండో పాట 1986లో వచ్చిన లాంగ్ దా లష్కర అనే సినిమాకు జగ్జీత్ సింగ్ సంగీత దర్శకత్వంలో పాడాడు. గురుదాస్ కు సెప్టెంబరు 7, 2010 న వుల్వర్ హాంప్టన్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో గౌరవ డాక్టరేటు లభించింది.[4]

మూలాలు[మార్చు]