గురు అర్జున్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురు అర్జున్
ਗੁਰੂ ਅਰਜਨ
పేపర్ మీద వాటర్ కలర్ పెయింటింగ్,
ప్రభుత్వ మ్యూజియం, చండీగఢ్
జననం15 April 1563 (1563-04-15)
మరణం1606 మే 30(1606-05-30) (వయసు 43)[1]
ఇతర పేర్లుఐదవ గురువు
క్రియాశీల సంవత్సరాలు1581–1606
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అంతకు ముందు వారుగురు రాందాస్
తరువాతివారుగురు హర్ గోవింద్
జీవిత భాగస్వామిమాతా గంగా
పిల్లలుగురు హర్ గోవింద్
తల్లిదండ్రులుగురు రాందాస్, మాతా భానీ

గురు అర్జున్ (పంజాబ్:ɡʊru əɾdʒən; 1563 ఏప్రిల్ 15 – 1606 మే 30) [1] సిక్ఖు మతంలో తొలి అమరవీరుడు, సిక్ఖుల పదిమంది గురువుల్లో ఐదవ వారు, పదకొండవ గురువుగా, శాశ్వత గురువుగా ప్రఖ్యాతి చెందిన గురుగ్రంథ సాహిబ్ను సంకలనం చేసినవారు. పంజాబ్ లోని గోయింద్వాల్లో గురు రాందాస్, గురు అమర్ దాస్ కుమార్తె మాతా భాని దంపతుల చిన్న కొడుకు.[2]

గురు అర్జున్ శతాబ్దిలో పావు వంతు భాగం సిక్కు గురువుగా జీవించారు. అమృత్ సర్ నిర్మాణాన్ని పూర్తిచేశారు, తర్ణ్ తారణ్, కర్తార్ పూర్ వంటి నగరాలను స్థాపించారు. గురు అర్జున్ సింగ్ సిక్ఖు మతానికి చేసిన అత్యున్నత కృషి పూర్వపు గురువులందరి బోధలను, వారికి పూర్వం సిక్ఖు సిద్ధాంతాలపై గట్టి ప్రభావం చూపించిన సాధు సంతుల బోధలన్నిటినీ సంకలనం చేసి ఒక పవిత్ర గ్రంథం: గురు గ్రంథ్ సాహిబ్ ను రూపకల్పన చేశారు. సిక్ఖు గురువు ద్వారా తొలిగా ప్రచురితమైన రాతప్రతి రూపంలో నిలిచివున్న ఒకే ఒక గ్రంథం.[3]

సిక్ఖు గురువుల బోధలను నేర్చుకుని, వ్యాప్తిచేస్తూ, సిక్ఖు మతానికి విలువైన కానుకలను సిక్ఖుల ఆదాయం నుంచి ధనం, వస్తువుల రూపంలో అందుకుంటూండే మసంద్ లనే మత ప్రచారకులను గురు అర్జున్ ప్రారంభించారు. సిక్ఖులు గురుద్వారాలు, లాంగర్ (కలసి వండుకునే సామాజిక వంటశాలలు) ల నిర్మాణాలకు సహకరించేందుకు దస్వంద్ లను సిక్ఖులు చెల్లించేవారు. లాంగర్ అనేది గురునానక్ ప్రారంభించినా గురు అర్జున్ లాంగర్లను మతపరమైన కర్తవ్యంగా క్రమబద్ధమైన వ్యవస్థగా ఏర్పరిచారు, అది అప్పటినుంచీ కొనసాగుతూ వస్తోంది.[4]

ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆదేశాల మేరకు గురు అర్జున్ బంధితుడయ్యారు, ఆయనను ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశారు.[5][6] ఆయన మతం మారేందుకు అంగీకరించకపోవడంతో, చిత్రహింసలు పెట్టి సా.శ.1606లో చంపేశారు.[5][7] చారిత్రిక ఆధారాలు చూసినా, సిక్ఖు సంప్రదాయం పరిశీలించినా గురు అర్జున్ ను నీట ముంచి చంపేశారా, లేక చిత్రహింసల వల్ల చనిపోయారా అన్నది స్పష్టం కాలేదు.[5][8] ఆయన బలిదానం సిక్ఖు మత చరిత్రను మలుపుతిప్పిన కీలకమైన సంఘటన.[5][9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Arjan, Sikh Guru". Encyclopaedia Britannica. Retrieved 5 May 2015.
  2. Mcleod, Hew (1997). Sikhism. London: Penguin Books. p. 28. ISBN 0-14-025260-6.
  3. Mahajan, Vidya Dhar. "Ch. 10". Muslim Rule In India (fifth ed.). p. 232.
  4. DS Dhillon (1988), Sikhism Origin and Development Atlantic Publishers, pp. 204-207
  5. 5.0 5.1 5.2 5.3 Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan Archived 2016-03-03 at the Wayback Machine, Journal of Philosophical Society, 12(1), pages 29-62
  6. Kulathungam, Lyman (2012). Quest : Christ amidst the quest. Wipf. pp. 175–177. ISBN 978-1-61097-515-5.
  7. Jahangir, Emperor of Hindustan (1999). The Jahangirnama: Memoirs of Jahangir, Emperor of India. Translated by Thackston, Wheeler M. Oxford University Press. p. 59. ISBN 978-0-19-512718-8.
  8. Louis E. Fenech, Martyrdom in the Sikh Tradition, Oxford University Press, pp. 118-121
  9. WH McLeod (1989). The Sikhs: History, Religion, and Society. Columbia University Press. pp. 26–51. ISBN 978-0231068154.