గురు కరుణామయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురు కరుణామయ
గురు కరుణామయ
జననం
కొంపెల్ల వెంకట సూర్య సుబ్బా రావు

చెన్నై, తమిళనాడు.
విద్యసివిల్ ఇంజనీర్
వృత్తిఆధ్యాత్మిక గురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీవిద్య గురువు
జీవిత భాగస్వామిఉషా రత్న
తల్లిదండ్రులు
  • సూర్య నారాయణ మూర్తి (తండ్రి)
  • యశోద (తల్లి)

గురు కరుణామయ భారతీయ ఆధ్యాత్మిక, శ్రీ విద్య సంప్రదాయక గురువు.[1] వారి జన్మ నామము కొంపెల్ల సుబ్బారావు. దేవిపురం వ్యవస్థాపకులు శ్రీ అమృతానంద నాథ సరస్వతి (ప్రహ్లాద శాస్త్రి) వారి గురువు.[2]

జీవితం[మార్చు]

గురు కరుణామయ 1953 వ సంవత్సరంలో మద్రాసు నగరంలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీర్ పట్టా స్వీకరించారు. 1978 సంవత్సరంలో శ్రీ అమృతానంద నాథ సరస్వతి ( అప్పటి పేరు యన్. ప్రహ్లాద శాస్త్రి) గారు టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు కొంపెల్ల సుబ్బారావు గారికి శ్రీ విద్య ఉపాసనలో దీక్ష ఇచ్చారు.

ఆయన గురువు గారి అధే శానుసారం శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఆసక్తి ఉన్న వారికీ దీక్ష నివ్వ నారంభించారు. కొంత కలం వారు న్యూజీలాండ్ దేశంలో ఉద్యోగం చేసిన తరువాత కొంత కాలానికి అమెరికావి సంయుక్త రాష్ట్రాలులో స్థిరపడ్డారు. ఒక దశాబ్దం అమెరికా దేశంలో వున్నా తరువాత భారతదేశంలో శ్రీ విద్యా ఉపాసనకు ప్రాచుర్యం కలిపించాలని తలంచి గురు కరుణామయి దేవీపురంలో వారి గురువు శ్రీ అమృతానంద నాథ సరస్వతి సన్నిధికి చేరుకున్నారు.

శ్రీ అమృతానంద నాథ సరస్వతి, సుబ్బారావును "గురు కరుణామయ బాబా"గా నామకరం చేసి దేవీపురం పీఠాధి పతిగా నియమించారు. దేవీపురంలో కరుణామయను "చిన్న గురూజీ" అని సమంబోధించేవారు. కొంత కాలం వారు దేవీపురం బాధ్యతలు నిర్వహించి తరువాత గురువుగారి ఆశీర్వాదంతో సాధ్యమైనంత మందికి శ్రీ విద్యాని చేర్చాలనే సంకల్పంతో 'సౌందర్య లహరి ట్రస్ట్' ని స్థాపించారు.[3]

శ్రీ విద్యా సంప్రదాయం[మార్చు]

గురు కరుణామయ శ్రీ విద్యలోని అత్యంత ప్రామాణికమైన గ్రంథాలలో ఒకటైన పరశురామ కల్పసుత్ర లో పేర్కొన్న వైదిక కౌల సంప్రదాయం (కౌలాచార, కౌలమర్గ అని కూడా పిలుస్తారు) ప్రకారం శ్రీ విద్యను బోధిస్తారు.

శ్రీ మహా విష్ణువు యొక్క ఐదవ అవతారమైన పరశురాముడు గురు దత్తాత్రేయ శిష్యుడు. పరశురాముడు కల్పసూత్ర రచయిత అని చెప్పబడింది.[4] ఇది శ్రీ యంత్రంలో (శ్రీ చక్రం అని కూడా పిలుస్తారు) పూజించబడే మాతృ దేవత లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధ. 'కల్ప' అనే పదం శాస్త్రపరమైన ఆచారాలను నియంత్రించే నియమాలను నిర్దేశించే గ్రంథమ్.[5]

సౌందర్య లహరి ట్రస్ట్ సంస్థ[మార్చు]

గురు కరుణామయ పరశురామ కల్పసూత్రంలో వివరించిన విధంగా వైదిక సంప్రదాయం ప్రకారం శ్రీ విద్యను ప్రోత్సహించడం కోసం "సౌందర్య లహరి ట్రస్ట్"ను స్థాపించారు. శ్రీ విద్య యొక్క రహస్య ఉపాసనను, సిద్ధాంతాన్ని నేర్చుకోవాలనుకునే ఎవరికైనా బోధించటానికి నెలకొల్పబడి న సంస్థ 'సౌందర్య లహరి ట్రస్ట్'.

హిందూ సంప్రదాయంలో శ్రీ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే బోధించేవారు. జగన్మాత అనుగ్రహం కోరుకునే ఎవరికైనా శ్రీ విద్యఅందుబాటులో వుండాలని గురు కరుణామయ సంకల్పం. కరుణామయ 'శ్రీ విద్యా గణపతి సాధన' అనే గ్రంథం కూడా ప్రచురించారు.[6]

స్త్రీలకు సాంప్రదాయకంగా శ్రీ విద్య యొక్క జ్ఞానాన్ని నిరాకరించేవారు. కరుణామయ తన సంస్థ ద్వారా కుల, మత, లింగ, జాతి భేదాలు లేకుండా అమ్మ అనుగ్రహం అందరిలో ప్రసరించాలనే దృఢ సంకల్పంతో ఆ లలితా దేవి స్వరూపా లైన స్త్రీ మూర్తులను యెక్కువగా నేర్చుకోవడానికి ప్రోత్సహిస్థారు.

కరుణామయ శ్రీ శంకర టీవీలో దేవి ఖడ్గమాలపై శ్రీ యంత్రం (శ్రీ చక్రం అని కూడా పిలుస్తారు) యొక్క నిగూడ అర్థాన్ని వెల్లడిస్తూ వరుస ప్రసంగాలు చేశాడు.[7] తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న SVBC TV (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) లో మంత్ర మహిమ (మంత్రాల శక్తి) పై కరుణామయ ప్రసంగాలను ప్రసారం చేసింది.[8]

కరుణామయ మార్గదర్శకత్వంలో, అతని శిష్యులు న్యూజెర్సీలోని క్రాన్‌బరీలో 67,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ చక్రాన్ని గీశారు. 108 ఎంపిక చేయబడ్డ చొట్లలో వేద హోమం (అగ్ని ఆచారాలు) ఏకకాలంలో నిర్వహించారు.[9]

ఇది కూడ చూడు[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

  1. "గురుదేవోభవ". SVBCTTD LIVE TV. Retrieved 22 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Guru Karunamaya Seeker". www.speakingtree.in. Retrieved 2022-01-22.
  3. Bowden, Michael (2017). The Goddess and the Guru: A Spiritual Biography of Sri Amritananda Natha Saraswati. USA: 45th Parallel Press. ISBN 978-0997946604.
  4. Triparthi, Mrityunjay (2011). Shri Parashuram Kalpa Sutra (in Sanskrit and Hindi). India: Chowkhamba Sanskrit Series. ISBN 8170802768.
  5. ఉమానంధానాథ (2010). నిత్యోత్సవ నిబంధః (Based on Parashurama Kalpa Sutra). Hyderabad: Mohan Publications.
  6. Sri Vidya Ganapathi Sadhana: Ganapathi Puja Guide Part 1. India: Soundarya Lahari Organisation. 2018.
  7. "Inner Meaning of Khadgamala by Sri Guru Karunamaya". Sri Sankara TV Youtube Channel. Jul 16, 2021. Retrieved 22 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "మంత్ర మహిమ". SVBC TTD Youtube Channel. Apr 9, 2021. Retrieved 22 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Projects". Soundarya Lahari Trust (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-22.

బాహ్య లింకులు[మార్చు]

గురు కరుణామయ అధికారిక వెబ్‌సైట Archived 2022-01-29 at the Wayback Machine