Jump to content

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్

వికీపీడియా నుండి
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
రకము ఉపగ్రహ టెలివిజన్
Branding శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
లభ్యత భారతదేశం,
వ్యవస్థాపకుడు తితిదే
ఆవిర్భావ దినం 7 జులై 2008

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ [1] 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారంచేసే ఒక టెలివిజన్ సంస్థ. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నడుపబడుతుంది. తిరుమలలో శ్రీవారికి జరిగే వివిధ ముఖ్యమైన పూజా కార్యక్రమాలను, వివిధచోట్ల దేవాలయాలలో జరిగే ముఖ్యమైన ఉత్సవ కార్యక్రమాలను ఈ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ ఛానల్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను భారత రాష్ట్రపతి ప్రతిభాపటేల్ 7 జూలై 2008న ప్రారంభించారు. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక సంబంధమైన హిందూ కార్యక్రమాలను ప్రసారం చేయడం. ఈ ఛానల్ ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో జరిగే వివిధ వాహన సేవల, రథోత్సవంలను ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. శ్రీవారి భక్తులకు అంకితం చేయబడిన ఈ ఛానల్ తెలుగు భాషతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా ప్రసారం చేస్తుంది.

ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్ 2009లో నంది టివి అవార్డ్స్ గెలుపొందింది. ఈ ఛానల్ భారతదేశంలో అన్ని కేబుల్, డిష్ టివి లకు ఉచితంగా తన ప్రసారాలను అందిస్తుంది. ఇంటర్నెట్లో కూడా ఈ ఛానల్ తన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

కార్యక్రమాలు

[మార్చు]
  • ఆధ్యాత్మిక విశేషాలు - ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్మం 1 గంటకు, మరళ రాత్రి 10 గంటలకు.
  • కళ్యాణోత్సవం - ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుతుంది
  • జానపద లహరి - ప్రతి గురువారం రాత్రి 8:30 గంటలకు;
  • డయల్ యువర్ ఈ.ఓ. - ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 8:30 గంటలకు
  • నాథనీరాజనం - ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7:30 వరకు.
  • ప్రభాత సేవాంజలి - ఉదయం 2.55 గంటలకు.
  • విష్ణుపురాణం - ప్రతి శనివారం, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు.
  • శతమానం భవతి - ప్రతిరోజు ఉదయం 10 గంటలకు.
  • సంపూర్ణ రామాయణం - ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు.

వనరులు

[మార్చు]
  1. ఎస్విబిసి జాలస్థలం