Jump to content

గుర్రం

వికీపీడియా నుండి
(గుఱ్ఱం నుండి దారిమార్పు చెందింది)

గుర్రము
పెంపుడు జంతువు
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
ఈ. కాబలస్
Binomial name
ఈక్వస్ కాబలస్
Synonyms

Equus ferus caballus (see text)
Equus laurentius

గుర్రము ఒక వేగంగా పరుగులెత్తే జంతువు. మానవుడు సుమారు క్రీ.పూ 4500 నుంచే గుర్రాలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు. క్రీ.పూ 3000- 2000 కల్లా ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుర్రాల శరీర నిర్మాణం, జీవిత దశలు, జాతులు, రంగు, ప్రవర్తన మొదలగు లక్షణాలను వివరించేందుకు విస్తృతమైన, ప్రత్యేకమైన పదజాలం ఉంది. predators దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తడానికి వీలుగా వీటి శరీరం నిర్మితమై ఉంటుంది. వీటికి ఐదు సంవత్సరాలు నిండేటప్పటికి మంచి యవ్వన దశలోకి వస్తాయి. సరాసరి జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.

శాన్ మార్కోస్ నేషనల్ ఫెయిర్‌లో చార్రెరియా ఈవెంట్

గుర్రాలను వాటి సామర్థ్యాలను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు.

  • మొదటి రకం గుర్రాలు మంచి శక్తి సామర్థ్యాలు కలిగి వేగంగా పరిగెత్తగలిగి ఉంటాయి.
  • రెండవ రకం కొంచెం నిదానంగా ఉండి, భారమైన పనులు చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
  • మూడవ రకం జాతికి చెందిన గుర్రాలు మొదటి రెండు రకాల సంకరజాతిగా చెప్పుకోవచ్చు. ఇవి యూరోపులో ఎక్కువగా కనపడుతుంటాయి.

చల్ చల్ గుఱ్ఱం

[మార్చు]
1800కు చెందిన గుర్రాల వ్యాపారి చిత్రం

చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలు నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్స విధానం...ఈక్వెస్ట్రియన్ రైడింగ్ గుర్రపు స్వారీ థెరపీ. మనదేశంలో నిపుణులు పుష్ప బోపయ్య . పోలియో, పక్షవాతం... మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చక్కటి చికిత్స గుర్రపు స్వారీ.'గుర్రపు స్వారీ ఆటవిడుపు. సాహస క్రీడ. మానసిక వికాసం లోపించిన చిన్నారుల పాలిట చక్కటి చికిత్స సాధనం.గుర్రపు స్వారీని పిల్లలు ఇష్టపడతారు. స్వారీలో గుర్రాల నైపుణ్యాన్ని గ్రహించగలుగుతారు. స్వారీ చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్నీ అందిస్తుంది. కళ్లాలు పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం, ఒక లయలో ముందుకు సాగడం... మెదడు, శరీరానికి మధ్య చురుకైన సమన్వయం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.దాంతో మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఈ చికిత్స కోసం పదేళ్ల పాటు సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. చిన్న పిల్లలతో మసిలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు వాటికి ముందే శిక్షణనిస్తారు. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుఱ్ఱంతో స్వారీ చికిత్స ఆరంభించాలన్నది నిర్ణయిస్తారు.స్వారీగా వెళ్లే మూడేళ్లు పైబడిన బాలలకు ఇరువైపులా సహాయకులు ఉంటారు.కండల సత్తువ పెరిగేలా, నడక తీరు మెరుగుపడేలా, శారీరక ఉత్తేజం ఒనగూరేలా చూస్తారు. (ఈనాడు 25.10.2009)

"https://te.wikipedia.org/w/index.php?title=గుర్రం&oldid=4270761" నుండి వెలికితీశారు