గులాం గార్డ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గులాం ముస్తఫా గార్డ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సూరత్, బ్రిటిషు భారతదేశం | 1925 డిసెంబరు 12|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1978 మార్చి 13 అహ్మదాబాదు, గుజరాత్ | (వయసు 52)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 84) | 1958 నవంబరు 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1960 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 నవంబరు 20 |
గులాం ముస్తఫా గార్డ్ (1925 డిసెంబరు 12 - 1978 మార్చి 13) 1958 నుండి 1960 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.
గులాం గార్డ్, 'ఒక పొడవాటి, ఎత్తైన భుజాలున్న వ్యక్తి, అతను పన్నెండు అంగల్లో వికెట్‌పైకి దూసుకెళ్తాడు, మీడియం పేస్ కంటే ఎక్కువ వేగంతో, కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ నుండి దూరంగా బంతిని స్వింగు చేస్తాడు, ముఖ్యంగా కొత్త బంతితో'. [1] భారత బౌలింగును మొదలుపెట్టిన మొదటి ఎడమచేతి వాటం బౌలరు. 6' 3" ఎత్తుతో అతను, 1930 లలో లద్ధా రామ్‌జీ, ఆ తరువాత తొంభైలలో అబే కురువిళాల మధ్య భారతదేశం తరపున ఆడిన అత్యంత పొడవైన క్రికెటరు. గార్డ్ 1946 నుండి 1947 వరకు 15 సంవత్సరాలకు పైగా బాంబే, గుజరాత్‌ల తరఫున భారత దేశీయ క్రికెట్‌లో విజయవంతంగా బౌలింగ్ చేశాడు.
1958-59లో వెస్టిండీస్‌తో బాంబే (ముంబై)లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యేటప్పటికి అతనికి దాదాపు 33 ఏళ్లు. అతను మూడు మంచి వికెట్లు తీశాడు – జాన్ హోల్ట్ (జూనియర్), కాన్రాడ్ హంటే, గ్యారీ సోబర్స్ – కానీ మిగిలిన సిరీస్‌లో జట్టు నుంచి తొలగించబడ్డాడు. 1959లో ఇంగ్లాండ్‌లో పర్యటించలేదు.
1959-60లో బాంబే (ముంబై)లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గార్డ్ మళ్లీ ఆడాడు గానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. జట్టు నుండి మళ్లీ తొలగించారు. ఆ సీజన్‌లో, అతని వికెట్లు, బలమైన బ్యాటింగ్ లైనప్‌తో కలిసి రంజీ ట్రోఫీని బాంబే గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాయి. ట్రోఫీ ఫైనల్‌లో మైసూర్‌పై 135 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో 15 సగటుతో 31 వికెట్లు తీశాడు.
గుజరాత్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. [2]