అక్షాంశ రేఖాంశాలు: 23°27′24″N 85°33′19″E / 23.45667°N 85.55528°E / 23.45667; 85.55528

గెటల్సుడ్ ఆనకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గెటల్సుడ్ ఆనకట్ట
(రుక్కా ఆనకట్ట)
గెటల్సుడ్ ఆనకట్ట is located in Jharkhand
గెటల్సుడ్ ఆనకట్ట
జార్ఖండ్ రాష్ట్రంలో ఉనికి
దేశంభారతదేశం
ప్రదేశంఒర్మాంజీ, రాంచీ, జార్ఖండ్
అక్షాంశ,రేఖాంశాలు23°27′24″N 85°33′19″E / 23.45667°N 85.55528°E / 23.45667; 85.55528
స్థితివాడుకలో ఉంది
ప్రారంభ తేదీ1971
యజమానిజె.ఎస్.ఈ.బి
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంకాంక్రీట్ గురుత్వాకర్షణ ఆనకట్ట
నిర్మించిన జలవనరుసువర్ణలేఖ నది
Height116 అడుగులు (35 మీటర్లు)
జలాశయం
ఉపరితల వైశాల్యం717 కి.మీ2 (277 చ. మై.)
సాధారణ ఎత్తు1954 అడుగులు (596 మీటర్లు)
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుజె.ఎస్.ఈ.బి
టర్బైన్లు2 x 65 MW Francis-type
Installed capacity130 MW

గెటల్సుడ్ ఆనకట్ట జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీజిల్లాలోని ఒర్మాంజీలో ఉన్న సువర్ణలేఖ నదిపై నిర్మించిన ఆనకట్ట.[1] 1971లో ప్రారంభించబడిన ఈ ఆనకట్ట రాంచీ, రాంగడ్ జిల్లాలలోని ప్రజలకు ఒక ప్రసిద్ధ విహారయాత్ర స్థలంగా మారింది. రుక్కా ప్రాంతంలోని స్థానిక ప్రజలకు చిన్నస్థాయి మత్స్య సేకరణకు ఉపయోగపడుతుంది. రాంచి వాసుల తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ఆనకట్ట యొక్క ప్రధాన లక్ష్యం. అంతే కాకుండా, పారిశ్రామిక అవసరాలకోసం, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఈ ఆనకట్ట ఉపయోగపడుతుంది.

ప్రదేశం

[మార్చు]

చోటా నాగపూర్ పీఠభూమి యొక్క ఈశాన్య సరిహద్దులో ఉన్న ఈ ఆనకట్ట, రుక్కా బ్లాకులో ఉండడం వల్ల దీనిని రుక్కా ఆనకట్ట అని కూడా పిలుస్తారు. ఇది రాంచీ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, రాంగఢ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ముఖ్యాంశాలు

[మార్చు]

717 కి.మీ.ల పరీవాహక ప్రదేశంతో ఉన్న ఈ ఆనకట్ట 1,954 అడుగుల పూర్తి రిజర్వాయర్ స్థాయిని కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు తగినంత నీరు రాగానే ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయబడుతుంది. వివిధ పండుగలరోజున రాంచీ, రాంఘర్ ప్రజలు ఇక్కడి వేడుకలను జరుపుకుంటారు. దీని చుట్టుపక్కల అనేక విహార ప్రాంతాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 30 June 2018.