Jump to content

గేయ కవిత

వికీపీడియా నుండి

గేయ కవిత/గేయం అంటే గానయోగ్యమైనది. గేయానికి, పాటకు పెద్దగా తేడాలు వెతకలేము. గేయంలో మాత్రాఛందస్సుకు ప్రాధాన్యం ఉంటుంది.

గురజాడ రచించిన దేశ భక్తి గేయంకు ఒక ఉదాహరణ. ద్విపద లక్షణాలున్నా గురజాడ ప్రత్యేకంగా ముత్యాలసరాలు అను ఛందస్సును సృష్టించుకున్నాడు.


గేయ కవితకు ప్రాణం పోసినవారిలో కృష్ణశాస్త్రి అగ్రగణ్యుడు. ఇతను రచించిన కృష్ణ పక్షము వంటి కావ్యాలన్నిటిలో గేయ కవితా లక్షణాలు కనిపిస్తాయి. ఆధునిక కాలంలో పద్యం నుండి విడివడి గేయ కవిత ఒక ప్రత్యేక ప్రక్రియగా తెలుగులో వెలుగులోనికి వచ్చింది. ఆంగ్లేయ సాహిత్య ప్రభావం గేయ రచన మీద ఉంది.


రొమాంటిసిజం ప్రభావంచేత తెలుగు సాహిత్యంలో భావ కవిత ఒక విలక్షణ కవితా ప్రక్రియగా బయటపడింది. భావకవులు గేయ రచనకు శ్రీకారం చుట్టారు. పద్యాలలోని నియమితమైన చందస్సు కాకుండా , స్వతంత్రత కలిగిన మాత్రా చందస్సు, యతి ప్రాసలకు ప్రాధాన్యం లేకపోవడం, అంత్య ప్రాసల ఆడంబరం గేయ కవిత లక్షణాలు.

మాకొద్దీ తెల్లదొరతనము- దేవ మాకొద్దీ తెల్లదొరతనము
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించె

అన్న గరిమెల్ల గారి గేయంలో 40 చరణాలున్నాయి. కాబట్టి గేయ కవితకు సుదీర్ఘతకూడా ఉండవచ్చు. గేయకవితలొ పల్లవి, చరణాలు అన్న విభజన చేస్తే అది పాట అవుతుంది.


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గేయ_కవిత&oldid=4232700" నుండి వెలికితీశారు