గొట్టిపాటి కొండపనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొట్టిపాటి కొండపనాయుడు భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత. అతను కావలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యునిగా 1972 నుండి 1978 వరకు పనిచేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1956లో గట్టుపల్లి పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ జీవితం ఆరంభించాడు. అతను అదే పంచాయతీకి 1959, 1964, 1970లలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1959-62, 1962-64 చిన క్రాక పంచాయతీ సమితి అధ్యక్షునిగా, 1964-70, 1970-72 వింజమూరు పంచాయతీ సమితి అధ్యక్షునిగా, 1964-70 కాలంలో నెల్లూరు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షునిగా, 1964-70 జిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీ సభ్యునిగా,1972-78 కాలంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యునిగా సేవలందించాడు.

1972లో స్వతంత్ర అభ్యర్దిగా గొట్టిపాటి విజయం సాధించాడు. స్వతహాగా గొట్టిపాటి మంచి రచయిత కూడా... ఆయన ఉత్తర కాలువ సాధన కోసం అనేక పోరాటాలు చేసి సాధించాడు. ఈ కాలువకు గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం నామకరణం చేసింది. తన రాజకీయ జీవితంలో పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న అతను అభిమానులను మాత్రం కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఎడ్లబండ్లపై, సైకిల్‌రిక్షాలపై, అనుచరుల ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రాజకీయాలు సాగించాడు. తన సొంత పంచాయతీలో వైద్యశాల, వసతిగృహాలు, రోడ్ల అభివృద్ధి, పశువైద్యశాల ఏర్పాటు చేయించగలిగాడు. అంతేకాక పలుగ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి మంచి పేరు సాధించాడు. తన రాజకీయ పయనంలో సొంత ఆస్తులు కరగతీసుకున్నాడే తప్ప సంపాదించిందేమీ లేదు. కుటుంబంలో కూడా వారసులను రాజకీయంగా పెంచలేదు. గొట్టిపాటి స్వార్థరాజకీయాలకు దూరంగా ఉన్నారనే పేరుంది. నేటికీ ఆయన అభిమానులు కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో ఉండి రాజకీయాలు చేస్తున్నారు.[1]

రచనలు[మార్చు]

"మనం-మనదేశం", "ఆంధ్రప్రదేశ్", "దేశదర్శిని", "నెల్లూరు దర్శిని" పుస్తకాలను రచించాడు.

మూలాలు[మార్చు]

  1. m.andhrajyothy.com https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-739398. Retrieved 2020-06-17. Missing or empty |title= (help)