గొట్టిపాటి నరసయ్య
గొట్టిపాటి నరసయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మార్టూరు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతని స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడి. తన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మార్టూరు నియోజకవర్గం తరపున 1994 ఎన్నికలలో విజయం సాధించాడు. తన తండ్రి మరణానంతరం అదే నియోజకవర్గంలో 1997 జగిరిన ఉప ఎన్నికలో అతను ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి పై విజయం సాధించాడు.[2] 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతరపున మార్టూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నర్రా శేషగిరి రావుపై విజయం సాధించాడు. [3] 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున అదే నియోజక వర్గం నుండి పోటీ చేసాడు కానీ కాంగ్రెస్ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయాడు. [4] 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున పర్చూరు శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేసాడు కానీ కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.[5] అతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించాడు.[6]
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అతను 2013 డిసెంబరు 7న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 December 2013). "కన్నీటి వీడ్కోలు". Retrieved 4 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2022-04-25. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2022-05-20. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.
- ↑ "Gottipati Narasaiah died – Prakasam district – hello ap" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-05.
- ↑ Sakshi (7 December 2013). "మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.