గొర్రెల పెంపకం
Jump to navigation
Jump to search
ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డిలో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది.[1]వాటి పెంపక వివరాలకు సమీపంలో ఉండే వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా పశువుల ఆసుపత్రిని సంప్రదించవచ్చు.
భారత దేశ మేకల జాతులు
[మార్చు]- జామ్నపరీ (ఇతవా జిల్లా, ఉత్తర ప్రదేశ్ )
- చేతల్ ( పంజాబ్ )
- బార్ బరీ ( ఆగ్రా, మధుర ప్రాంతాలు, ఉ. ప్ర )
- మలబారీ ( కేరళ )
- సుర్తీ (గుజరాత్)
- కశ్మీర్ ( జమ్మూ కాశ్మీరు)
- బెంగాల్ మేక ( పశ్చిమ బెంగాల్ )
లాభాలు
[మార్చు]- గొర్రెల పెంపకంలో పెద్దగా ¸ తీసుకోవలసిన ఆతీ జాగ్రత్తలేమీ లేవు. పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడి పోతాయి.
- రోజు రోజుకు మాంసం ధ ర పెరుగుతూంటుంది.
- ఉన్ని, మాంసం లభిస్తాయి.
- ప్రతిసారి గొర్రె ఒక్కింటికి 1-2 గొర్రె పిల్లల్ని ఈనుతుంది .
- గొర్రె ఒక్కింటికి 20-30 కి. గ్రా. మాంసం లభిస్తుంది .
- మంద కడి తే నేల సారవంతమౌతుంది .
గొర్రెల రకాలు
[మార్చు]- స్థానిక గొర్రెలు : ప్రాంతాన్నిబట్టి రకరకాలు ఉన్నాయి.
- విదేశీ సీమ రకాలు : మెరినో - ఉన్ని కోరకు
- రాంబౌల్లెట్ - ఉన్ని, మాంసం
- సౌత్ డాన్ - మాంసం
- చేవియేట్ - మాంసం
ఆర్థికం
[మార్చు]- ప్రారంభ ఖర్చు - ఎనిమిది మాసాల గొర్రె పిల్ల రూ. 1000/- నుండి రూ. 1200/- ఉంటుంది.
- 6-7 ఏళ్ళ వయసు వచ్చి పెద్దవైపోయిన గొర్రె రూ. 800-1000/- లకు అమ్మచ్చు.
- 1 1/2 సంవత్సరాల వయసున్న పొట్టేలును అమ్మితే రూ. 1500- 2000/- వస్తుంది .
- మంచి జాతి గొర్రె దొరుకు ప్రదేశాలు.
- గొర్రెల షెడ్లు తయారిలోను.
- గొర్రెల మేత, విషయంలోనూ.
- ఆరోగ్యమైన గొర్రెలను పెంచడం.