గొర్లవారిపాలెం
గొర్లవారిపాలెం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
గొర్లవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | గుంటూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్ |
పిన్ కోడ్ | 522017 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]పశువైద్యశాల.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]మంచినీటి చెరువు:- ఈ చెరువులో పూడిక ఎక్కువగా పేరుకొనిపోయి, వేసవిలో గ్రామంలో నీటు ఎద్దడి ఎక్కువగుచున్నది. ఈ చెరువులో, ఇప్పుడు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పొక్లెయినుల సాయంతో, పూడికతీత కార్యక్రమం ముమ్మరంగా సాగుచున్నది. రైతులు ట్రాక్టర్లతో ఈ చెరువు మట్టిని తమ ఇళ్ళకూ మరియూ పొలాలకు ఎరువుగానూ తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయడంవలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయే గాక, తమ భూములకు సారవంతమైన ఎరువు లభించుచున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో డి.విజయకుమారి, సర్పంచిగా ఎన్నికైంది.. ఉపసర్పంచిగా నల్లపనేని సుజాత ఎన్నికైంది.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు, పత్తి , మిరప
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.