గొలుసు పంపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Al-Jazari's hydropowered saqiya chain pump in 1206.
Two types of hydraulic-powered chain pump from the Chinese encyclopedia Tiangong Kaiwu (1637), written by Song Yingxing.

గొలుసు పంపు అనగా ఒక రకమైన నీటి పంపు, ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, మరియు ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, మరియు ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

తాడు పంపు