గోదావరి పుష్కర ఘాట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగానది తర్వాత మన దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 1,465 కి.మీ. (910 మైళ్లు) మేర ప్రవహించి బంగాళాఖాతంలో సంలీనమవుతుంది. అలాగే, దేశంలోనే సువిశాల నదీ పరీవాహక ప్రాంతాలను కలిగి ఉన్న నదులలోనూ ఇదొకటి. ఇంతటి గోదారమ్మ మన రాష్ట్రంలోకి ప్రవేశించే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదులుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన భద్రాచలం దాకా అనేక ఘాట్‌లు భక్తుల కోసం కొలువుతీరాయి.

నిజామాబాద్‌ జిల్లా[మార్చు]

నిజామాబాద్‌ జిల్లా గోదావరి నది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో గోదావరి నదికి 11 పుష్కర కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లి, బినోల, తుంగిని, ఉమ్మెడ, పోచాంపాడ్‌, సావెల్‌, తడ్‌పాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ పుష్కర కేంద్రాల్లో భక్తుల సౌకర్యార్థం 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు.

కందకుర్తి త్రివేణి సంగమం, శివాలయం (రేంజాల్ మం॥)

కోస్లి హనుమాన్ టెంపుల్ (నవీపేట్ మం॥)

థాడ్బిలోలి శివాలయం, హనుమాన్ టెంపుల్ (రేంజాల్ మం॥)

బినోలా గౌతమేశ్వరస్వామి ఆలయం (నవీపేట్ మం॥)

తుంగిని హనుమాన్ టెంపుల్ (నవీపేట్ మం॥)

తాడ్‌పాకల్ (మోర్తాడ్ మం॥)

ఉమ్మెడ (నందిపేట్ మం॥)

పోచంపాడు ఎస్‌ఆర్‌ఎస్‌పి క్యాంప్ కాలనీ (బాల్‌కొండ మం॥)

ఆదిలాబాద్ జిల్లా[మార్చు]

బాసర (ముధోల్ మం॥)

వస్తాపూర్ (లోకేశ్వరం మం॥)

సోవాన్ (నిర్మల్ మం॥)

ఖానాపూర్ (గ్రా, మం॥)

చింతగూడ (జన్నారం మం॥)

సీతారాంపల్లి, ముల్కాల (మంచిర్యాల మం॥)

లక్సెట్టిపేట (గ్రా, మం॥)

గూడెం (దండేపల్లి మం॥)

వెల్లాల (జైపూర్ మం॥)

చెన్నూర్ (గ్రా, మం॥)

చింతలచాంద (లక్ష్మణచాంద మం॥)

పీచర హన్మాన్ టెంపుల్ (లక్ష్మణచాంద మం॥)

సాంగ్వి (దిల్వాపూర్ మం॥)

పోంకల్ నాగులమ్మ టెంపుల్ (మంమ్దా మం॥)

ద్వారక (దండేపల్లి (మం॥)

తింబరేణి (దిల్వార్‌పూర్ మం॥)

కామల్‌కోట్ బ్రిడ్జి (మాంమ్దా మం॥)

ఆస్తా (ముధోల్ మం॥)

కరీంనగర్‌ జిల్లా[మార్చు]

కరీంనగర్‌ జిల్లాలో 35 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మొత్తం 10 మండలాల్లో 170 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం వాల్గొండ, మల్లాపూర్‌, సారంగపూర్‌, ధర్మపురి, వెల్గటూరు, రామగుండం, కమాన్‌పూర్‌, మంథని మండలాల్లో ఈ ఘాట్లను నిర్మించారు.

ధర్మపురి ప్రధాన ఘాట్, సంతోషిమాత ఆలయం వద్ద

ధర్మపురి ప్రధాన ఘాట్, మంగటిగడ్డ సోమవిహార్, ఘాట్2

ధర్మపురి మహాలక్ష్మి దేవాలయం

తిమ్మాపూర్ (ధర్మపురి మం॥)

కాళేశ్వరం (మహదేవపూర్ మం॥)

కోటిలింగాల (వెలగటూరు మం॥)

మంథని (గ్రా, మం॥)

ఈర్ధాని (ఇబ్రహీంపట్నం మం॥)

వెల్గొండ రామాలయం (మల్లాపూర్ మం॥)

వెల్గొండ హనుమాన్ దేవాలయం వద్ద (మల్లాపూర్ మం॥)

వేంపల్లి వెంకట్రావుపేట హనుమాన్ టెంపుల్, గంగమ్మ గుడి ముందుభాగం (మల్లాపూర్ మం॥)

బోర్నపల్లి రామాలయం (రాయికల్ మం॥)

కమ్మనూర్ (సారంగపూర్ మం॥)

వేములకుర్తి (ఇబ్రహీంపట్నం మం॥)

కోమటి కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)

ఫకీర్ కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)

మూలరాంపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)

రత్నాలమడుగు వేములకుర్తి, యానాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)

మొగిలిపేట (మల్లాపూర్ మం॥)

ఓబులాపూర్ (మల్లాపూర్ మం॥)

కొత్త ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)

పాత ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)

కరీంనగర్‌ జిల్లాకాళేశ్వరం పుష్కర స్నానఘట్టాలు[మార్చు]

ఇబ్రహీంపట్నం : కోమటికొండాపూర్‌, ఎర్ధండి, మూలరాంపూర్‌, వేములకుర్తి, యామాపూర్‌, ఫకీర్‌ కొండాపూర్‌

  • సారంగపూర్‌ : కమ్మునూరు
  • రాయికల్‌ : బోర్నపల్లి
  • మల్లాపూర్‌ : మొగిలిపేట, కొత్తదాంరాజ్‌పల్లి, పాతదాంరాజ్‌పల్లి, వాల్గొండ, ఓబులాపూర్‌, వెంకట్రావుపేట
  • ధర్మపురి : ధర్మపురి, తిమ్మాపూర్‌, రాయపట్నం
  • వెల్గటూర్‌ : కోటిలింగాల
  • రామగుండం : గోలివాడ, గోదావరిఖని
  • కమాన్‌పూర్‌ : సుందిళ్ల
  • మంథని : కాశిపేట, మంథని
  • మహాదేవపూర్‌ : కాళేశ్వరం

వరంగల్‌ జిల్లా[మార్చు]

ఏటూరునాగారం, మంగపేట మండలాలు నదీ పరీవాహక ప్రాంతాలు. జిల్లాలో మూడు పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు

మల్లకట్ట (ఏటూర్ నాగారం మం॥)

రామన్నగూడెం (ఏటూర్ నాగారం మం॥)

మంగపేట్ (గ్రా, మం॥)

వరంగల్‌ జిల్లాలో ఉన్న మూడు పుష్కరఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలేమి లేవు. ఏజెన్సీ మారుమూల గ్రామాల కావడంతో మండలక్రేందాల్లో సైతం చెప్పుకోదగ్గ లాడ్జీలు, హోటళ్లు లేవు. ఇక్కడ వచ్చిన ప్రజలు పుణ్యస్నానాలు చేయగానే తిరిగి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు.

ఖమ్మం జిల్లా[మార్చు]

1. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సమీపంలోని విస్తా కాంప్లెక్సు వద్ద.

2. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సమీపంలో ప్రస్తుతం ఉన్న స్నానాలఘాట్‌కు కుడివైపున.

3. దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామంలో రామాఘాట్‌వద్ద.

4. దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామంలోని సీతాఘాట్‌ వద్ద.

5. వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలోని అంకన్నగూడెం శ్రీఆంజనేయ స్వామి దేవాలయం వద్ద.

6. మణుగూరు మండలం చిన్నరావిగూడెం గ్రామంలోని శ్రీముత్యాలమ్మ దేవాలయం వద్ద.

7. మణుగూరు మండలం రామానుజవరం పంచాయితీ కొండాయిగూడెం గ్రామంలోని శ్రీభ్రమరాంబ సమేత శ్రీవైద్యనాథ లింగేశ్వరస్వామి దేవాలయం వద్ద.

8. బూర్గంపాడు మండలం మోతెగడ్డ గ్రామంలోని శివాలయం వద్ద

తూర్పు గోదావరి జిల్లా[మార్చు]

పుష్కరాల సందర్భంగా కొత్తగా నిర్మించిన ఘాట్లతో కలిపి తూర్పుగోదావరి జిల్లాలో 183 స్నానాల ఘాట్లు ఉన్నాయి. అయితే కొన్ని ఘాట్లకే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎ ప్లస్, ఎ, బి, సి కేటగిరీలుగా ఘాట్లను అధికారులు వర్గీకరించారు. రాజమండ్రి నగరంలోని కోటిలింగాలఘాట్, పుష్కర్‌ఘాట్లను ఎ ప్లస్ కేటగిరీగాను, సరస్వతిఘాట్, గౌతమఘాట్, మార్కండేయఘాట్, రామపాదాలు ఘాట్, కోటిపల్లి ఘాట్లను ఎ కేటగిరీ ఘాట్లుగాను నిర్ణయించారు. 'బి' కేటగిరి ఘాట్లుగా రాజమండ్రిలోని సుబ్బాయమ్మఘాట్, ధవళేశ్వరంలోని సున్నంబట్టిఘాట్, గాయత్రిఘాట్, చింతలఘాట్, సిఇఆర్‌పి ఘాట్, కోటిపల్లిలోని మరో ఘాట్, వాడపల్లి, ముక్తేశ్వరం, తొత్తరమూడి, బోడసకుర్రు, మురముళ్ల, అప్పనపల్లి, సోంపల్లి, రాజోలు, బొబ్బిలంక, ముగ్గళ్ల, కొత్తపేట, గేదెల్లంక ప్రాంతాల్లోని ఘాట్లను గుర్తించారు. మిగిలిన ఘాట్లన్నింటినీ సి కేటగిరీ ఘాట్లుగా పరిగణిస్తున్నారు.

కోటి లింగాల ఘాట్

దేశంలోనే అతిపెద్దదిగా నిర్మించిన కోటిలింగాల ఘాట్ ఈసారి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఘాట్‌ను విస్తరించిన తరువాత దాని పొడవు 1128 మీటర్లు. ఇక్కడ గంటకు 70 వేల మంది పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం ఉంది. రోజుకు 8 లక్షల మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు చేసే విధంగా దీనిని తీర్చిదిద్దారు.

శివుడి సాక్షిగా జల్లు స్నానం

కోటి లింగాల ఘాట్‌కు మధ్యలో శ్రీఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయం వైపు ధ్యాన ముద్రలో శివుడి విగ్రహం ఉండే విధంగా నిర్మించిన జల్లు స్నాన ఘట్టం 2015 గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. వికలాంగులు, వృద్ధులు జల్లు స్నానఘట్టం కిందే పుణ్యస్నానం చేయవచ్చు.
పుష్కరఘాట్

గతంలో వెడల్పు 290 మీటర్లు. 140 మీటర్లు ఉన్న ఘాట్‌ను మరో 150 మీటర్లు విస్తరించారు. ఇక్కడ రోజుకు 3లక్షల మంది పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం ఉంది. గోదావరి రైల్వేస్టేషన్ పక్కనే ఉండటంతో పాటు నగర నడిబొడ్డున ఉన్న ఈ ఘాట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
సరస్వతి ఘాట్

దీనిని ఈసారి పుష్కరాలకు విఐపి ఘాట్‌గా గుర్తించారు. దీని పొడవు సుమారు 170 మీటర్లు. జాతీయ, రాష్టస్థ్రాయి ప్రముఖలకు ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
గౌతమ ఘాట్

పొడవు 200 మీటర్లు. 2003 పుష్కరాల్లో ఇదే విఐపి ఘాట్. పుష్కరాల తరువాత ఈ ఘాట్ రాజమండ్రిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
రామపాదాలు ఘాట్

ధవళేశ్వరంలోని రామపాదాలు ఘాట్ పొడవు 71మీటర్లు. రాజమండ్రిలోని ఘాట్ల తరువాత ఈ ఘాట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పోలీసుల ఆంక్షలను దాటుకుని రాజమండ్రి వరకు రాలేని వారు ధవళేశ్వరంలోని రామపాదాలు రేవులోనే పుణ్యస్నానాలు చేస్తారు. ఈ ఘాట్లు మినహా మిగిలిన వాటిలో భక్తుల తాకిడి తక్కువ ఉంటుంది. ధవళేశ్వరం నుండి రాజమండ్రి వరకు ఉన్న చిన్న పెద్ద ఘాట్లు కలిపి సుమారు 16 వరకు ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా[మార్చు]

గోదావరి పుష్కరాలకు జిల్లాలో 97 ఘాట్లు ఏర్పాటు చేశారు.

'ఎ' గ్రేడు ఘాట్లు

కొవ్వూరు పట్టణం

1. గౌతమి 2. వశిష్ఠ 3. సీతారామ 4. సుబ్రహ్మణ్యేశ్వర 5. శ్రీభక్తాంజనేయ 6. లాంచీల రేవు వద్ద 7. గోష్పాదక్షేత్రం, పిండప్రదానాల రేవు - 8. వీరినమ్మ గుడి 9. సిద్ధాంతం, పిండ ప్రదానాల రేవు -

నరసాపురం

10. అమరేశ్వరస్వామి 11. లలితాంబాదేవి ఆలయం 12. వలంధర రేవు 13. కొండాలమ్మ దేవాలయం

'బి' గ్రేడు ఘాట్లు తాళ్లపూడి

14. ప్రక్కిలంక 15. తాళ్లపూడి 16. వేగేశ్వరపురం

కొవ్వూరు

17. శ్రీనివాసపురం 18. వాడపల్లి సుమా పాఠశాల 19. వాడపల్లి శివాలయం నిడదవోలు 20. విజ్జేశ్వరం

పెరవలి

21. తీపర్రు

యలమంచిలి

22. కరుగోరుమిల్లి - సీహెచ్‌ నారాయణ

ఆచంట

23. భీమలాపురం

యలమంచిలి

24. దొడ్డిపట్ల 25. లక్ష్మీపాలెం నరసాపురం 26. పొన్నపల్లి

'సి' గ్రేడు ఘాట్లు

27. కృష్ణారావుపేట 28. పట్టిసం, కన్నాపురం టి.జంక్షన్‌ అటవీ చెక్‌పోస్టు 29. పాత పట్టిసీమ (పాత ఇసుక ర్యాంపు) 30. పట్టిసీమ ఉత్సవ 31. పట్టిసీమ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం 32. పట్టిసీమ కనకదుర్గమ్మ దేవాలయం 33. పట్టిసీమ అభిమన్యు బస్‌స్టాప్‌ 34. గూటాల (పాత పట్టిసీమ) 35. గూటాల రామాలయం ఎదురుగా 36. గూటాల (కొత్త పట్టిసీమ) వెంకటేశ్వరస్వామి గుడి 37. గూటాల (కొత్త పట్టిసీమ) దుర్గమ్మ దేవాలయం 38. గూటాల రామాలయం వద్ద 39. గూటాల అంబేడ్కర్‌ విగ్రహం ఎదురుగా 40. గూటాల వినాయక దేవాలయం 41. గూటాల ఆంజనేయస్వామి దేవాలయం 42. గూటాల కృష్ణుడి గుడి 43. గూటాల కుమ్మరివారి వీధి ఎదురు 44. గూటాల సుంకరవారి వీధి ఎదురు 45. గూటాల కొండ్రువారి వీధి 46. గూటాల మహాలక్ష్మిదేవిపేట రామాలయం 47. తాళ్లపూడి 48. తాళ్లపూడి-1 49. తాళ్లపూడి-2 50. తాళ్లపూడి మండలం 51. తాళ్లపూడి మండలం 52. కొవ్వూరు మండలం 53. కొవ్వూరు మండలం 54. కొవ్వూరు మండలం 55. కొవ్వూరు మండలం 56. కొవ్వూరు ఔరంగాబాద్‌ 57. వాడపల్లి మహర్షి వేదవిజ్ఞాన పీఠం ఎదురు 58. వాడపల్లి బంగారమ్మపేట 59. కొవ్వూరు మండలం మద్దూరు 60. నిడదవోలు మండలం పెండ్యాల 61. పెరవలి మండలం కానూరు అగ్రహారం 62. ఉలుసుమర్రు 63. పెరవలి మండలం ముక్కామల 64. పెరవలి మండలం కాకరపర్రు 65. పెరవలి మండలం మల్లేశ్వర 66. పెనుగొండ మండలం నడిపూడి 67. పెనుగొండ మండలం చినమల్లం 68. నరసాపురం మాధవాయపాలెం 69. నరసాపురం నందమూరు 70. ఆచంట మండలం పెదమల్లం 71. ఆచంట మండలం పెదమల్లం మాసేనమ్మ 72. ఆచంట మండలం కోడేరు 73. యలమంచిలి మండలం కంచు స్తంభంపాలెం 74. యలమంచిలి మండలం బూరుగుపల్లి 75. యలమంచిలి మండలం కనకాయలంక 76. యలమంచిలి మండలం పెదలంక 77. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం 78. యలమంచిలి మండలం గంగడపాలెం 79. యలమంచిలి మండలం యలమంచిలిలంక 80. యలమంచిలి మండలం యలమంచిలి 81. యలమంచిలి మండలం చించినాడ 82. యలమంచిలి మండలం ఏనుగువానిలంక 83. యలమంచిలి మండలం బాడవ

నరసాపురం

84. స్మృతివనం 85. పీచుపాలెం 86. మాస్కేపాలెం 87. రాజులలంక 88. దర్భరేవు 89. బియ్యపుతిప్ప

కుక్కునూరు

90. పెదరావిగూడెం 91. కౌండిన్యముక్తి 92. కుక్కునూరు

వేలేరుపాడు

93. రుద్రమ్మకోట 94. తాటుకూరుకొమ్ము 95. కటుకూరు 96. కోయదా స్నాఘట్టం-1 97. కోయదా స్నానఘట్టం-2