Jump to content

గోధుమ గడ్డి

వికీపీడియా నుండి
ఇండోర్ 8-10 రోజుల పంట ముందు పెరిగిన గోధుమ గడ్డి
Extracting wheatgrass juice with a manual juicing machine.

గోధుమ గడ్డి ని "జీవం కలిగిన ఆహారం"గా పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఇ "తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి.

పోషకాలు

[మార్చు]
  • క్లోరోఫిల్ ని అందిస్తుంది .
  • రక్త శుద్ధికి,
  • శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది.
  • రోగోనిరోధక శక్తిని పెంచుతుంది,
  • అలసటను తగ్గిస్తుంది .
  • మెరుగుపరుస్తుంది .
  • కాన్సర్ వ్యాధి పెరుగుడలు నివారిస్తుంది .
  • గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విసపురితాలన్ని బయటికు విసర్జింపబడతాయి.

రోగాల నివారణి

[మార్చు]
Table 1. Nutrient comparison of 1 oz (28.35 g) of wheatgrass juice, broccoli and spinach.
Nutrient Wheatgrass Juice Broccoli Spinach
Protein 860 mg 800 mg 810 mg
Beta-carotene 120 IU 177 IU 2658 IU
Vitamin E 880 mcg 220 mcg 580 mcg
Vitamin C 1 mg 25.3 mg 8 mg
Vitamin B12 0.30 mcg 0 mcg 0 mcg
Phosphorus 21 mg 19 mg 14 mg
Magnesium 8 mg 6 mg 22 mg
Calcium 7.2 mg 13 mg 28 mg
Iron 0.66 mg 0.21 mg 0.77 mg
Potassium 42 mg 90 mg 158 mg
Data on broccoli and spinach from USDA database.[1] Data on Wheatgrass juice from indoor grown wheatgrass.[2]

గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసు లోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయ లేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు. గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము.

  • ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.
  • అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.
  • తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోక పోతే వాళ్ళు ప్రతివారం రక్తం మార్పిడి చేసుకోవలసి వస్తుంది. చంఢఘీడ్‌ లోని పెడియాట్రిక డిపార్ట్‌మెంట్‌, ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది.
  • శక్తి ప్రదాయిని: గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది.
  • నూతనోత్తేజం కలిగిస్తుంది: గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.
  • బరువును పెంచుతుంది:గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బరువు పెరగని వారికి ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది-బరువును పెంచుతుంది .
  • క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యామ్నాయాంగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]

గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిణామంలోనే తీసుకోవాలి. అధి కంగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స ఉంటాయి.[3] తల నొప్పి, జీర్ణకోశ వ్యాధులు, పళ్లరంగు మారడం, మగతగా ఉండడం జరుగుతుంది. గోధుమ రసాన్ని తాజాగానే, వెంటనే వాడాలి. నిలువ వుంచి తీసు కోరాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు.[4]

ఎవరికైతే గోధుమ రసం పడదో, వారు మానివేయడం మంచిది. డాక్టర్‌ లేదా న్యూట్రిషియన్‌ ఎక్సపర్ట్‌ లేదా పౌష్టికాహార నిపు ణుని సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి. ఇంట్లో గోధుమ గడ్డి పెంపకం గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే పెంచు కుని దానినుండి రసం తీసుకోవచ్చును. గోధుమ లను ఓ గిన్నెలో 8 నుండి 10 గంటలవరకు నానబెట్టాలి. ప్రతి నాలుగు గంటలకూ నీ రు మార్చాలి. రెండు అంగుళాల రంధ్రాలు గలిగిన ఓ ట్రేను తీసుకోవాలి. దానిలో మూడింతలు మట్టిని వేయాలి. ఆ మట్టిపై నీటిని పోయాలి. గోధుమలను సమానంగా ఆ మట్టిలో వేయాలి. కిటీకీ సమీపాన గాలి తగిలేటట్లు మొక్కలకు పేపర్‌ టవల్‌ను ఉంచాలి. సరాసరి సూర్య రశ్మి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ ఉ దయాన్నే నీరు పోయాలి. సాయంకాలం కొంచెం నీరు చిమ్మితే సరి పోతుంది. ఐదో రోజుకి మొక్కలు ఒక అంగుళం ఎదుగు తాయి. ఇప్పుడు కొంచెం నీరు రోజుకు ఒక సారి పెడితే సరిపోతుంది. పదోరోజుకి గోధుమ గడ్డి 6, 7 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది. ఈ సమయంలో గడ్డిని కోసి రసాన్ని తీసుకోవచ్చు. పది రోజుల తర్వాత గోధుమ మొక్కలు 7-8 ఇంచీల మేరకు మొలకెత్తుతాయి. అప్పుడు వాటిని వేళ్ళతో సహా పెకిలించండి. వేర్లను వేరు చేసుకోండి. మిగిలిన మొక్క భాగాలను, ఆకులను రుబ్బుకోండి. రుబ్బుకున్న పదార్థాన్ని వడకట్టుకోండి. వడకట్టగా వచ్చిన రసాన్ని వెంటనే సేవించండి. కాస్త ఆలస్యమైతే ఇందులోని శక్తి తగ్గిపోతుంది. వారానికి ఓ సారి ఈ రసాన్ని సేవిస్తుంటే ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా తగ్గిపోతుంది.


మూలాలు

[మార్చు]
  1. "USDA Nutrient Database". Archived from the original on 2015-03-03. Retrieved 2007-11-06.
  2. Meyerowitz, Steve (1999). "Nutrition in Grass". Wheatgrass Nature's Finest Medicine: The Complete Guide to Using Grass Foods & Juices to Revitalize Your Health (6th ed.). Book Publishing Company. p. 53. ISBN 1-878736-97-3.
  3. గోధుమ గడ్డి రసం అధి కంగా తీసుకుంటే కలిగే సైడ్‌ ఎఫెక్ట్స
  4. గోధుమ గడ్డి రసం యొక్క సైడ్‌ ఎఫెక్ట్స

యితర లింకులు

[మార్చు]