Jump to content

గోపాలంవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°05′30″N 80°07′30″E / 16.091652°N 80.125080°E / 16.091652; 80.125080
వికీపీడియా నుండి
గోపాలంవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గోపాలంవారిపాలెం is located in Andhra Pradesh
గోపాలంవారిపాలెం
గోపాలంవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°05′30″N 80°07′30″E / 16.091652°N 80.125080°E / 16.091652; 80.125080
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522626
ఎస్.టి.డి కోడ్ 08647

గోపాలంవారిపాలెం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

తేలప్రోలు వీరయ్య చౌదరి

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ తేలప్రోలు వీరయ్య చౌదరిది రైతుకుటుంబం. వీరు ఇంజనీరింగు పట్టభద్రులు. వీరు కొంతకాలం రాష్ట్రప్రభుత్వ విభాగంలో పనిచేసిన తరువాత స్వంతంగా గుత్తేదారు వృత్తి స్వీకరించి "రాఘవేంద్ర కన్స్ ట్రక్షన్స్" అను సంస్థను స్థాపించి, మొదటిశ్రేణి గుత్తేదారుగా, కోట్ల రూపాయల విలువచేసే పలు నిర్మాణాలు చేశారు. వీరు ఎందరికో ఉన్నతస్థానం దిశగా సహాయంచేశారు. ఎందరికో విద్యాదానం చేశారు. పలువురు పేదయువతులకు వివాహాలు జరిపించి, వారికి కొత్త జీవితం ఇచ్చారు. మనసున్న మారాజుగా చిలకలూరిపేట ప్రాంతంలో పేరుగాంచారు. తన సంపాదనలో సగానికి పైగా సమాజసేవకు వినియోగించారు. అందరి బంధువుగా పేరుగాంచారు. తను పుట్టి పెరిగిన గోపాలంవారిపాలెం గ్రామాభివృద్ధికి గూడా, తనవంతు బాధ్యతగా సహాయం అందించుచున్నారు.[1] వీరికి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ గోపాలం రమేష్ బాబు, సత్యవతి దంపతుల ఒక మామూలు వ్యవసాయ కుటుంబీకులు. వీరి కుమారుడు మోహన కృష్ణ, విజయవాడలోని సూపర్ విజ్ శిక్షణా కేంద్రంలో సి.ఏ.చదువుచూనే, ఇటీవల ఐ.సి.డబ్ల్యు.ఎ. పరీక్షలు వ్రాసినాడు. 2015, సెప్టెంబరు-24న ప్రకటించిన ఆ ఫలితాలలో ఇతడు జాతీయస్థాయిలో 42వ ర్యాంక్ సాధించాడు.

గుంటూరు టెక్స్‌టైల్ పార్క్

[మార్చు]

ఈ గ్రామంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో, 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయుచున్న ఈ సంస్థ కార్యాలయ భవనాన్ని, 2017, జులై-27న ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ పార్క్‌ను మరియొక 60 ఎకరాలలో, మొత్తం 1200 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించెదరు.

మూలాలు

[మార్చు]
  1. "opalamvaripalem Map". Archived from the original on 2016-04-16. Retrieved 2015-09-10.