Jump to content

గోపాల్‌దాస్ శంకర్‌లాల్ అగర్వాల్

వికీపీడియా నుండి
గోపాల్‌దాస్ శంకర్‌లాల్ అగర్వాల్
గోపాల్‌దాస్ శంకర్‌లాల్ అగర్వాల్


పదవీ కాలం
2004 – 2019
ముందు కుతే రమేష్‌కుమార్ సంపత్రావు
తరువాత వినోద్ అగర్వాల్
నియోజకవర్గం గోండియా

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-27) 1951 జూలై 27 (వయసు 73)
గోండియా, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ (2019కి ముందు), (2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2019-2024)
వృత్తి రాజకీయ నాయకుడు

గోపాల్‌దాస్ శంకర్‌లాల్ అగర్వాల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు గోండియా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గోపాల్‌దాస్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో గోండియా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గోపాల్‌దాస్ అగర్వాల్ 2014 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

గోపాల్‌దాస్ అగర్వాల్ 2019 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వినోద్ అగర్వాల్ చేతిలో ఓట్లు తేడాతో ఓడిపోయి, తిరిగి 2024 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో,[2] చేరి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వినోద్ అగర్వాల్ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. Hindustan Times (23 November 2024). "Former Gondia MLA Gopaldas Agrawal returns to Cong from BJP". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  3. The Times of India (23 November 2024). "Gondiya Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Gondiya". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.