గోపాల్ జీ ఠాకూర్
| గోపాల్ జీ ఠాకూర్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 మే 23 | |||
| ముందు | కీర్తి ఆజాద్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | దర్భంగా | ||
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 2017 – 2019 | |||
బీహార్ శాసనసభ సభ్యుడు
| |||
| పదవీ కాలం 2010 – 2015 | |||
| ముందు | నియోజకవర్గం సృష్టించబడింది | ||
| నియోజకవర్గం | బేనిపూర్ | ||
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, దర్భంగా
| |||
| పదవీ కాలం 2003 – 2007 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 అక్టోబరు 15 దర్భంగా, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | దివంగత గణేష్ ప్రసాద్ ఠాకూర్ (తండ్రి) రామ్ సాగర్ దేవి (తల్లి) | ||
| జీవిత భాగస్వామి | చందు ఠాకూర్ (M.1999) | ||
| సంతానం | 1 కొడుకు & 1 కూతురు | ||
| నివాసం | దర్భాంగా & ఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గోపాల్ జీ ఠాకూర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]గోపాల్ జీ ఠాకూర్ 1984 నుండి 1990 వరకు దర్భంగా విద్యార్థి రాజకీయాల్లో ఆయన చాలా చురుకుగా ఉన్నాడు. ఆయన 1990లో తన గ్రామమైన పారి పంచాయతీ అధ్యక్షుడయ్యాడు. 1992లో బిజెపి బిరౌల్ యువజన విభాగానికి అధ్యక్షుడయ్యాడు. 1994లో బిజెపి దర్భంగా జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1996 నుండి 2003 వరకు రెండు పర్యాయాలు బిజెపి బిరౌల్ అధ్యక్షుడిగా పని చేశాడు. 2003లో ఆయన దర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడయ్యాడు. 2007 నుండి 2013 వరకు రెండు పర్యాయాలు బిజెపి బీహార్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2010లో దర్భంగాలోని బెనిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2017లో బిజెపి బీహార్ ఉపాధ్యక్షుడయ్యాడు.
గోపాల్ జీ ఠాకూర్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బారి సిద్ధిఖీపై 2,67,979 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి లలిత్ కుమార్ యాదవ్‌పై 1,78,156 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Darbhanga". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.